tied to tree
-
గొలుసుతో చెట్టుకు కట్టేసి
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అడవుల్లో ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసి ఉన్న ఓ మహిళ కనిపించింది. రోజులుగా ఆహారంలేక ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. పశువుల కాపరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళ దగ్గర దొరికిన యూఎస్ పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా లలిత కాయి కుమార్ ఎస్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. సింధుదుర్గ్‌లో సోనుర్లి గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి శనివారం సమీపంలోని అడవులకు వెళ్లాడు. అక్కడ అతనికి మనిషి మూలుగు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఓ మహిళ కాలికి ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సావంత్‌వాడీ ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. మహిళ దగ్గర యూఎస్ పాస్‌పోర్ట్, తమిళనాడు అడ్రస్‌తో ఆధార్ ఉందని, పదేళ్లుగా ఆమె తమిళనాడులో ఉంటోందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆమె మాట్లాడలేని స్థితిలో ఉందన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళను.. ఇంట్లో గొడవల కారణంగా భర్తే.. 40 రోజుల కిందట అడవిలో వదిలేసి వెళ్లినట్లుగా ఆస్పత్రిలో ఆమె రాసిన వివరాల ఆధారంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ఆమె వీసా గడువు కూడా ముగిసిందని, విదేశీయుల స్థానిక నమోదు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు ఆమె భర్త, బంధువుల గురించి వించారించేందుకు కొన్ని బృందాలు తమిళనాడు, గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లాయన్నారు. -
అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి
నల్లబెల్లి: చెరువులో అనుమతి లేకుండా చేపలు పట్టిన పాపానికి గిరిజనులను బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుష ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన చిరుకూరి సుమన్, నల్లబెల్లి మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ఇసాల జగన్, కన్నారావుపేట ఉప సర్పంచ్ తురుస అశోక్, గట్టి చెన్నయ్యలు పద్మపురం సమీపంలోని అర్షనపల్లి చెరువులో చేపలు పట్టేందుకు గురువారం ఉదయం వెళ్లారు. చేపలు పడుతుండగా విషయం తెలుసుకున్న ఆ చెరువు కాంట్రాక్టర్లు సిద్ద గణేశ్, సురేశ్‌లతోపాటు మరికొందరు వెళ్లి ఆ నలుగురినీ వెంబడించారు. చిరుకూరి సుమన్ పట్టుబడగా.. మిగతా ముగ్గురూ పారిపోయారు. సుమన్ కాళ్లు, చేతులను వెనుకవైపు ఒంచి కట్టేసి బోల్లోనిపల్లికి తరలించారు. గ్రామంలో చెట్టుకు వలలతో కట్టేసి దాడి చేశారు. పారిపోయిన ఇసాల జగన్ బోల్లోనిపల్లి గ్రామానికి చేరుకుని కాంట్రాక్టర్‌తో చర్చించేందుకు ప్రయత్నించగా అతన్ని సైతం దూషిస్తూ బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. పంచాయితీ నిర్వహించి అక్రమంగా చేపలు పట్టిన నలుగురు వ్యక్తులూ రూ.25వేల జరిమానా చెల్లించాలని తీర్మానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పద్మాపురం గ్రామానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. -
ఫెయిల్ చేశాడని టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు
రాంచీ: విద్యాబుద్ధులు నేర్పే గురువులను ధైవంతో సమానంగా చూడాలంటారు పెద్దలు. కొన్నేళ్ల క్రితం అలాగే ఉండేది.. గురువుల పట్ల ఎంతో వినయంగా, భయం, భక్తితో మెలిగేవారు విద్యార్థులు. కానీ, ఇప్పుడు కాలం మారింది. గురువులనే ఎదురించే శిష్యులు తయారయ్యారు. అలాంటి సంఘటనే జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. 9వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేశారని ఓ గణితం టీచర్, క్లర్క్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు కొందరు విద్యార్థులు. గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో గత సోమవారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిదో తరగతి పరీక్షల ఫలితాలను జార్ఖండ్ అకాడమీ కౌన్సిల్ గత శనివారం విడుదల చేసింది. స్కూల్లోని 9వ తరగతిలో 32 మంది ఉండగా.. అందులో 11 మందికి ప్రాక్టికల్ పరీక్షలో గ్రేడ్ ‘డీడీ’ వచ్చింది. అంటే ఫెయిల్ అయినట్లే. దీంతో మార్కులు వేసిన ఉపాధ్యాయుడు, వాటిని జేఏసీ సైట్లో అప్లోడ్ చేసిన క్లర్క్‌ను పట్టుకుని చితకబాదారు. అయితే.. ‘ఈ సంఘటనపై స్కూల్ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటంతో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ని కలిసి ఫిర్యాదు చేయాలని కోరాం. కానీ, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందనే కారణంతో ఇచ్చేందుకు నిరాకరించారు.’ అని గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ నిత్యానంద్ భోక్తా తెలిపారు. బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్, క్లర్క్ సొనేరామ్ చౌరేగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారు సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉండగా అందులో చాలా మంది ఈ సంఘటనలో పాల్గొన్నట్లు బీడీవో అనంత్ ఝా తెలిపారు. బాధిత టీచర్ గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేయగా.. ఆయన్ను తొలగించారు. ప్రస్తుత సంఘటనతో 9, 10వ తరగతులకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. In #Jharkhand’s Dumka district, a group of school students tied their teachers to a tree and allegedly beat them up for giving them low scores which resulted in the students failing their exams. pic.twitter.com/vdr1Amubp4 — Samira Nabila (@SamiraNabila1) August 31, 2022 ఇదీ చదవండి: అంకిత సజీవ దహన ఉదంతంలో ట్విస్ట్.. ఆమె మైనర్, ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవే! -
భార్యను చెట్టుకు కట్టేసి భర్త అమానుషం..
-
వందమందిలో భార్యపై భర్త పైశాచికత్వం
సాక్షి, లక్నో : మానవత్వం మంటకలిసింది. ఒకరిని వేధిస్తుంటే మరొకరు చూసి ఆనందపడే పరిస్థితి తారా స్థాయికి వెళ్లింది. కనీసం జాలిపడకపోగా కళ్లప్పగించి చూసి వీడియోలు తీసుకోవడం షరా మాములు అయింది. ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే చుట్టూ ఉన్న వందమందిలో ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేదు. పైగా అదొక సినిమా చూసినట్లు చూశారు. వందమందిలో ఎక్కువశాతం పురుషులే ఉన్నారు. అయినప్పటికీ అలా చేయడం తప్పు అని ఏ ఒక్కరు చెప్పలేదు. ఇదంతా కూడా పంచాయతీ పెద్దలు నిర్వహించిన ఘనకార్యం. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మహిళపై పరాయి పురుషుడితో సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా భర్తే చేసి పంచాయతీ పెట్టించాడు. దాంతో ఓ వందమందికి పైగా ఓ చోట చేరి ఆమెను కట్టేసి కొట్టాలని శిక్ష విధించారు. అలా చేయడం తప్పు అని ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. వెంటనే ఆ మహిళ చేతులు తాడుతో కట్టి ఓ చెట్టుకొమ్మకు వేలాడదీసి కొట్టడం మొదలు పెట్టారు. ఓ సైకిల్ ట్యూబ్, టైరు తీసుకొని అందరూ చూస్తు నవ్వుతుండగా ఆమె భర్త దాదాపు చచ్చేన్ని దెబ్బలు కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె స్పృహకోల్పోయింది. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వేగంగా స్పందించిన పోలీసులు ఆమె భర్తను, పంచాయతీ ప్రధాన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరో 25మందిపై కూడా కేసులు పెట్టారు. -
చెట్టుకు కట్టేసి కొట్టడంతో...
రాంచి: హిందూ యువతిని ప్రేమించాడన్న కారణంతో ముస్లిం యువకుడిని కొట్టి చంపిన ఘటన జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు మహ్మద్ షాలిక్(20) గుమ్లా పట్టణంలోని రజా కాలనీకి చెందిన వాడని పోలీసులు తెలిపారు. సోసో గ్రామానికి చెందిన హిందూ యువతిని అతడు ప్రేమించాడు. శ్రీరామనవమి రోజున ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన అతడిని స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. గంటల తరబడి హింసించారు. విషయం తెలుసుకున్న అతడి తండ్రి మహ్మద్ మినహాజ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల సహాయంతో అతడిని సమీపంలోని సర్దార్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాంచిలోని రిమ్స్ తరలిస్తుండగా మార్గమధ్యలో షాలిక్ కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, పేరు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గుమ్లా పట్టణంలో అదనపు భద్రత ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.