చెట్టుకు కట్టేసి కొట్టడంతో... | Muslim man tied to tree, beaten to death for being in love with Hindu woman | Sakshi
Sakshi News home page

చెట్టుకు కట్టేసి కొట్టడంతో...

Published Fri, Apr 7 2017 2:46 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

చెట్టుకు కట్టేసి కొట్టడంతో... - Sakshi

చెట్టుకు కట్టేసి కొట్టడంతో...

రాంచి: హిందూ యువతిని ప్రేమించాడన్న కారణంతో ముస్లిం యువకుడిని కొట్టి చంపిన ఘటన జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు మహ్మద్ షాలిక్(20) గుమ్లా పట్టణంలోని రజా కాలనీకి చెందిన వాడని పోలీసులు తెలిపారు. సోసో గ్రామానికి చెందిన హిందూ యువతిని అతడు ప్రేమించాడు. శ్రీరామనవమి రోజున ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన అతడిని స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. గంటల తరబడి హింసించారు.

విషయం తెలుసుకున్న అతడి తండ్రి మహ్మద్ మినహాజ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల సహాయంతో అతడిని సమీపంలోని సర్దార్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాంచిలోని రిమ్స్ తరలిస్తుండగా మార్గమధ్యలో షాలిక్‌ కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, పేరు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గుమ్లా పట్టణంలో అదనపు భద్రత ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement