ఘోరం: నిండు గర్భిణిపై దారుణంగా దాడి: వీడియో వైరల్‌ | 8 Month Pregnant Woma, Husband Brutally Thrashed In UP | Sakshi
Sakshi News home page

Viral Video: నిండు గర్భిణిపై దారుణంగా దాడి

Published Sat, Dec 17 2022 3:33 PM | Last Updated on Sat, Dec 17 2022 3:55 PM

 8 Month Pregnant Woma, Husband Brutally Thrashed In UP - Sakshi

నిండు చూలాలుపై కొందరూ గూండాలు ఘోరంగా దాడి చేశారు. అందుకు సంబంధించిన ఘటన నెట్టింట వైరల్‌ కావడంతో పోలీసులు సీరియస్‌ అయ్యి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..సందీప్ అనే యువకుడు, అతడి భార్య ఉపాసనపై కొందరూ దుండగులు ఘోరంగా దాడి చేశారు. కొందరూ వ్యక్తులు వచ్చి ఆ యువకుడిని అతడి మామ గురించి ఆరా తీశారు. ఐతే ఆ యువకుడు అతని మామ గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదని వారంతా దుర్భాషలాడటం ప్రారంభించారు.

దీన్ని సందీప్‌ వ్యతిరేకించడంతో అతడిపై దుండగలు దాడి చేయడం ప్రారంభించారు. దాడిని ఆపేందుకు సందీప్ భార్య ఉపాసన ప్రయత్నించగా.. ఆమెపై కూడా దారుణంగా దాడి చేశారు సదరు దుండగులు. దీంతో ఉపాసన స్ప్రుహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత వారి కేకలు విని స్థానికులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఈ మేరకు పోలీసులు నిందితులు రవీంద్ర, మన్మోహన్, మన్మోహన్‌ కుమారుడు ఆదేశ్‌లుగా గురించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు శైలేంద్ర బాజ్‌పాయ్‌ అన్నారు. 

(చదవండి: భార్యతో మీద కోపంతో.. రెండేళ్ల కొడుకును భవనంపై నుంచి పడేసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement