గర్భిణీకి కరోనా: మరి అప్పుడే పుట్టిన శిశువుకు? | Lucky: Coronavirus Patient Gives Birth Baby With No Infection In China | Sakshi
Sakshi News home page

వైరల్‌: పండంటి బాబుకు జన్మనిచ్చిన కరోనా వ్యాధిగ్రస్తురాలు

Published Sun, Feb 9 2020 4:33 PM | Last Updated on Sun, Feb 9 2020 5:35 PM

Lucky: Coronavirus Patient Gives Birth Baby With No Infection In China - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌తో చైనా జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎటువైపు నుంచి కరోనా తరుముకొస్తుందో, ఎవరి ప్రాణాన్ని హరిస్తుందోనని బెంబేలెత్తుతున్న చైనావాసులు భయం గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇక కరోనా వ్యాదిగ్రస్తులకు సేవలందిస్తున్న ఓ వైద్యురాలు తన కన్నకూతురుని మనసారా హత్తుకోలేకపోయింది. కరోనా హెచ్చరికలతో వారిద్దరూ కలుసుకోవడానికి వీల్లేదంటూ ఆసుపత్రి యాజమాన్యం తెగేసి చెప్పడంతో తల్లీకూతుళ్లు గాల్లోనే హగ్గులిచ్చుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర చైనాలోని జీజియాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ గర్భిణీ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది.(ఆ ‘వీడియో’ చైనా మార్కెట్‌ది కాదు!)

అయితే ఆమె కరోనా వ్యాధిగ్రస్తురాలు కావడంతో ఆ ప్రభావం పుట్టిన బిడ్డపై కూడా ఉంటుందని వైద్యులు కలవరపాటుకు లోనయ్యారు. పుట్టుకతోనే చావును కొనితెచ్చే రోగాన్ని వెంటబెట్టుకొచ్చాడని అందరూ ఆ శిశువుపై జాలి ప్రదర్శించారు. కానీ అనూహ్యంగా అసలు బాబుకు ఎలాంటి వ్యాది సోకలేదని నిర్ధారణ అయింది. దీంతో ఎందుకైనా మంచిదని కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్షించగా కరోనా లక్షణాలు మచ్చుకైనా లేవని, దరిదాపుల్లో కూడా అతనికి ఏ రోగం లేదని వెల్లడయ్యింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోగా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబును అదృష్టవంతుడంటూ కొనియాడుతున్నారు. భవిష్యత్తులోనూ అతనికి కరోనా సోకకూడదని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. ఈ లక్‌ జీవితాంతం అతని వెన్నంటే ఉండాలని బుడ్డోడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. (కరోనా అని అరిచి అత్యాచారం నుంచి తప్పించుకుంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement