ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం | Woman molested in busy market in UP's Mainpuri, beaten up with stick for resisting, suffers head injury | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం

Published Wed, Dec 21 2016 6:15 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Woman molested in busy market in UP's Mainpuri, beaten up with stick for resisting, suffers head injury

లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది.  తమను వేధిస్తున్న వారిని ప్రశ్నించిన పాపానికి ఓ దంపతుల పట్ల దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. గుండాల్లో  చెలరేగిన  ఆ దుర్మార్గులు ఆ యువ దంపతులపై దారుణంగా దాడిచేసి కొట్టారు.   ఉత్తరప్రదేశ్ లోని అగ్రా, మణిపురి జిల్లాలో ఈ ఘటన  జరిగింది. అయితే ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్  అయింది.  

వివరాల్లోకివెళితే..  ఓ   జంట తాము వెళ్లాల్సిన అడ్రస్ వెతుక్కుంటున్న క్రమంలో  స్థానికులు కొందర్ని  సంప్రదించారు. ఇంతలో  రద్దీగా మార్కెట్లో ఓ దుండగుడు వచ్చి ఆమె  పట్ల అనుచితంగా  ప్రవర్తించాడు. ఆమె చున్నీని లాగి, అమానవీయంగా ప్రవర్తించాడు. దీన్ని  గమనించి ఆమె భర్త వారించాడు. అంతే  మరో ఇద్దరు  దుండగులు సహా చెలరేగి  పోయారు. కర్రతో దాడికి దిగారు. ఈ ఘటనలో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి.   వీరికి ఒక పాప కూడా ఉన్నట్టు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
బాధితుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిలో ఒకరిని ఆనంద్  యాదవ్ గా గుర్తించారు.  మరోవైపు నిందితులను అరెస్ట్ చేయకపోతే  తనను తాను కాల్చుకు చనిపోతానని  బెదిరించినట్టుతెలుస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement