stick
-
పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే..
దీపావళి పండుగ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తూ పిల్లలు ఎంతో హడావుడి చేస్తుంటారు. దీపావళి వేళ ఎటుచూసినా దీపాల వెలుగులు కనిపిస్తాయి. దీపావళి నాడు చిన్న పిల్లల చేత పెద్దలు దివిటీలు కొట్టిస్తారు. దీనివెనుక ఒక పరమార్థం ఉంది.దీపావళి రోజున పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ దివిటీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. గోగు కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిని కట్టి, దానిని దీపంతో వెలిగిస్తారు. పిల్లలకు ఆ కర్రలను ఇచ్చి, పెద్దలు తమ సమక్షంలో ఆ దివిటీలను కొట్టిస్తారు. ఈ సమయంలో వాటిని గాలిలో గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పిల్లల చేత పాలు పాడిస్తూ ఈ వేడుక చేస్తారు.ఈ దివిటీలు కొట్టించే కార్యక్రమం ముగిశాక పిల్లల కాళ్లు చేతులు కడిగి స్వీట్స్ తినిపిస్తారు. అనంతరం పిల్లల చేత టపాసులు కాల్పిస్తారు. ఈ దివిటీలు కొట్టించడం వెనుకనున్న అంతరార్థం విషయానికొస్తే.. దీపావళి రోజున పితృదేవతలు సంధ్యా సమయంలో ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ గృహాలను చూస్తారట. వారికి ఆహ్వనం పలుకుతున్న రీతిలో దివిటీలను కాలుస్తారని పండితులు చెబుతారు. ఇది పూర్వకాలం నుంచి ఏర్పడిన సంప్రదాయం అని పెద్దలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..! -
మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు
మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే... దర్బాయి గ్రామంలోని బద్కుహి చౌకీ ప్రాంతంలో నివశిస్తున్న వినేద్ అనే ప్రబుద్ధుడు తన తల్లిని స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు రూ. 25 వేలు ఇమ్మని అడిగాడు. ఐతే అతడి తల్లి రూ. 15 వేలు మాత్రమే ఇచ్చింది. దీంతో వినోద్ కోపేద్రకంతో కన్నతల్లి అని కూడా లేకుండా కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తన కొడుకుకి తన నుంచి తన భర్త నుంచి డబ్బు తీసుకుంటుంటాడని కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు) -
Viral Video : కట్టి ని తీసుకుపోవడానికి కుక్క పడ్డ పాట్లు చూడండి..!
-
బ్రిటన్ రాణి తొలిసారి అలా కనిపించడంతో.. షాక్‌లో ప్రజలు
లండన్: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2కు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ఆసక్తి యూకే ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరికి ఉంటుంది. మరి ఆమే ఏం పడుచు పిల్ల కూడా కాదు. బ్రిటన్ రాణి వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలు. ఈ ఏజ్‌లోనూ రాణివారు ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంటారు. బహుశా ఈ విషయమే ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. చదవండి: బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...! సాధారణంగా ఇప్పటివరకు ఎలిజబెత్ రాణి బయట ఎక్కడ కనిపించినా ఎవరి సాయం లేకుండా స్వతహాగా నడుస్తూ ఉంటారు. అయితే తొలిసారి ఎలిజబెత్ తన చేతిలో కర్ర పట్టుకొని బయటకు వచ్చారు. మంగళవారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో చర్చిలో సమావేశానికి హాజరైన ఎలిజబెత్ కర్ర సాయంతో నడుస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.ఘీ 95 ఏళ్ల చక్రవర్తి ఆమె కుమార్తె ప్రిన్సెస్ అన్నేతో కలిసి నల్ల కర్ర పట్టుకుని కారు నుంచి బయటకు దిగారు. చదవండి: ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే బ్రటిన్ రాణి కర్ర పట్టుకొని నడవడం చాలా అరుదు కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2004లో మోకాలి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చివరిసారిగా ఆమె కర్రను పట్టుకొని కనిపించారు. అయితే ప్రస్తుతం ఎలిజబెత్ ఇలా ఎందుకు కర్రను ఉపయోగించాల్సి వచ్చిందో ఆమె కార్యాలయం కారణం వెల్లడించలేదు. -
నిర్లక్ష్యం ఎవరిది? చూస్తుండగానే గాల్లో కలిసిన ప్రాణాలు..
సాక్షి, జన్నారం(ఖానాపూర్): అతివేగం ప్రమాదానికి దారి తీస్తుంది. ఒక్కోసారి మృత్యువూ కబళిస్తుంది. అతివేగంగా దూసుకువస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద అధికారులు సూచించినా ఆగకుండా వెళ్లడం వల్లే ప్రమాదం సంభవించి వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తెలిసిందే. లక్సెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సుదగోని వెంకటేశ్‌గౌడ్(32) శనివారం తపాలపూర్ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద చెక్‌పోస్టు గేట్‌కు ఢీకొని మృతిచెందిన వీడియో వైరల్‌గా మారింది. వేగంగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న బీట్ అధికారి చేతితో సూచించినా ఆగలేదు. అతివేగంగా వస్తుండడాన్ని గమనించి గేట్‌ను ఎత్తే ప్రయత్నం చేస్తుండగా వాహన చోదకుడు క్షణాల్లో గేట్‌ను దాటి పోవాలని ప్రయత్నించాడు. వాహనం నడిపే వ్యక్తి ముందుకు వంగడంతో వెనుక కూర్చన్న వెంకటేశ్‌గౌడ్ గేట్‌కు ఢీకొని తలకు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ వీడియో ఆదివారం వైరల్ అయింది. అతివేగంగా నడిపిన చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు. -
కర్రతో కళాఖండాలు..!
కళాత్మక దృష్టి ఉంటే ప్రతీది కళాఖండమే అవుతుందని నిరూపిస్తున్నాడు ఆ యువకుడు. ఎందుకు పనికిరాని కర్ర, చెట్లవేర్లు, వెదురుతో రకరకాల ఆకృతుల్లో కళాఖండాలను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. చూడముచ్చటైన కళారూపాలతో ఆకట్టుకుంటున్నాడు. కర్రతో పిచ్చుక రూపాలు, గూళ్లు, గృహ అలంకరణ వస్తువులను కళాత్మకంగా తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు బెల్లంపల్లికి చెందిన దుర్గం కుల్దీప్. అటవీశాఖ ప్రోత్సహంతో... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన దుర్గం కుల్దీప్ 20ఏళ్ల క్రితం కర్రతో కళాత్మక వస్తువుల తయారీని నేర్చుకున్నాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ‘వినుకాలే’ అనే గురువు వద్ద మూడేళ్ళ పాటు శిక్షణ పొందాడు. ఇంటర్మీడియెట్ వరకు విద్యాభ్యాసం చేసిన కుల్దీప్ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు వెళ్లలేకపోయాడు. నచ్చిన కళను ఎంచుకుని రాణిస్తున్నాడు. అతడి కర్ర కళానైపుణ్యతను గమనించిన బెల్లంపల్లికి చెందిన అటవీశాఖ అధికారులు 16ఏళ్ల క్రితం బెల్లంపల్లికి రప్పించారు. నివసించడానికి ప్రత్యేకంగా గూడు కల్పించి కర్రతో చెక్కిన శిల్పాలు, ఇతర కళారూపాలను తయారు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. కర్రకు అద్భుత రూపాలు... అటవీ ప్రాంతంలో పనికిరాని, పడేసిన చెట్ల మొదళ్లు, చెట్లవేర్లు, వింతఆకృతుల్లోని కర్ర, వెదురుతో అనేక రకాల అద్భుతాలను చెక్కుతున్నాడు. అతడి చేతిలోపడిన ఎలాంటి కర్ర అయినా కళాత్మకంగానే తయారవుతుంది. ఇళ్లలో గృహ అలంకరణకు ఉపయోగపడే ఎన్నోరకాల వస్తువులు కర్రతో రూపొందించి మదిని దోస్తున్నాడు. చెట్టుపై వాలిన పిచ్చుకలు, పిచ్చుక గూళ్లు, నాగలితో పొలం దున్నుతున్న రైతు, టీ ట్రేలు, హెయిర్ క్లిప్పింగ్స్, సబ్బు పెట్టెలు, కూరగాయల బకెట్స్ , ప్రేమికుల బొమ్మలు, షోకేజ్ ఐటమ్స్ ఇలా రకరకాలతో అద్భుతంగా తయారు చేసి కర్రకు రంగులద్దుతున్నాడు. వినియోగించే కర్ర... కర్రతో శిల్పాలు చెక్కడానికి కళాత్మక వస్తువులు, కళాఖండాలను తయారు చేయడానికి కుల్దీప్ ప్రధానంగా ప్రత్యేకత కలిగిన కర్రను వినియోగిస్తాడు. మంచి రంగుకు వచ్చిన ముదురు టేకు, తెల్లటేకు, పునికి కర్ర, వెదురుతో మాత్రమే కళారూపాలు తయారు చేస్తాడు. మొత్తంగా టేకు, వెదు రు కర్రను అటవీశాఖ నుంచి కొనుగోలు చేస్తాడు. కర్ర కోసం జన్నారం, ఆసిఫా బా ద్, తిర్యాణి తదితర దట్టమైన అటవీ ప్రాం తాలకు వెళ్లి ఆకృతుల్లో కనిపించిన కర్రను సేకరిస్తాడు. ఆ కర్రతోనే కళారూపాలు త యారు చేసి జీవనోపాధి పొందుతున్నాడు. ఎగ్జిబిషన్లలో ప్రదర్శన.... ఏటా ఆయా నగరాల్లో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటారు. ఆ ఎగ్జిబిషన్లలో అటవీశాఖ తరపున కుల్దీప్ వెదురు, కర్ర చేతి వృత్తుల కళా ఖండాలను ప్రదర్శనలో ఉంచుతున్నాడు. కొన్నేళ్ల నుంచి హైదరాబాద్, కేరళ, ఢిల్లీ, బెంగుళూరు, త్రిపుర, మణిపూర్, అసోం తదితర ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లలో కళారూపాలు ప్రదర్శనకు అర్హత సాధిస్తున్నాయి. నేర్చుకున్న విద్య మరోపది మందికి ... కుల్దీప్ తాను నేర్చుకున్న విద్యను తన వరకే పరిమితం చేయలేదు. మరో పది మందికి నేర్పించాడు. తన వద్ద శిష్యరికం చేసిన యువకులు సొంతంగా కర్రతో కళాత్మక వస్తువులను తయారు చేసి స్వయం ఉపాధిని పొందుతున్నారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు. తన వల్ల పది కుటుంబాలు జీవనోపాధి పొందుతుండటం పట్ల కుల్దీప్ ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించాలి నా వద్ద విద్య ఉంది కానీ వ్యాపారం చేసుకునే అంత ఆర్థిక స్థోమత లేదు. నేను తయారు చేసిన కళ్మాతక వస్తువులను అమ్మి కుటుంబాన్నీ పోషించుకోవడానికే సరిపోతోంది. వ్యాపారం సాగించడానికి తగినంత ఆర్థిక వనరులు లేవు. స్వయం ఉపాధి కోసం రుణం మంజూరు చేయాలని ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్న కానీ అధికారులు మాత్రం రుణం మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా మాలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. – దుర్గం కుల్దీప్, బెల్లంపల్లి -
బాలుడి తలలో దిగిన కర్ర
అశ్వాపురం: ఓ బాలుడు మిత్రులతో సరదాగా ఆడుకుంటూ చింతకాయల కోసం చెట్టుకు కర్రలు విసురుతుండగా ప్రమాదవశాత్తూ తలలో గుచ్చుకున్న ఘటన అశ్వాపురం మండలం రామచంద్రాపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గూడూరు మధుకర్‌రెడ్డి(10) పాఠశాల నుంచి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుకుంటూ చింతచెట్టు వద్దకు వెళ్లాడు. స్నేహితుడు వెనుక నుంచి కర్ర విసరగా, మధుకర్ తల కింది భాగంలోకి దిగింది. చిన్న మెదడుకు సమీపంలో గుచ్చుకోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాలుడు స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. -
ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది. తమను వేధిస్తున్న వారిని ప్రశ్నించిన పాపానికి ఓ దంపతుల పట్ల దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. గుండాల్లో చెలరేగిన ఆ దుర్మార్గులు ఆ యువ దంపతులపై దారుణంగా దాడిచేసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని అగ్రా, మణిపురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. వివరాల్లోకివెళితే.. ఓ జంట తాము వెళ్లాల్సిన అడ్రస్ వెతుక్కుంటున్న క్రమంలో స్థానికులు కొందర్ని సంప్రదించారు. ఇంతలో రద్దీగా మార్కెట్లో ఓ దుండగుడు వచ్చి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె చున్నీని లాగి, అమానవీయంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించి ఆమె భర్త వారించాడు. అంతే మరో ఇద్దరు దుండగులు సహా చెలరేగి పోయారు. కర్రతో దాడికి దిగారు. ఈ ఘటనలో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఒక పాప కూడా ఉన్నట్టు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిలో ఒకరిని ఆనంద్ యాదవ్ గా గుర్తించారు. మరోవైపు నిందితులను అరెస్ట్ చేయకపోతే తనను తాను కాల్చుకు చనిపోతానని బెదిరించినట్టుతెలుస్తోంది. -
పుల్లే అని పారేయకండి
ఇప్పటి వరకు ఎన్నోరకాల జ్యుయెలరీ మేకింగ్‌ను చూశాం. కొత్తగా.. వింతగా.. చిత్రంగా అనిపించే జ్యుయెలరీలను చూశాం. అయితే ఈ వారం మేకింగ్ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఏమీ లేదండీ... ఎన్నో రకాల బ్రేస్లెట్లను చూసుంటాం. అవునా, కానీ పాప్సికల్ స్టిక్ బ్రేస్లెట్లను చూశారా? అదేనండీ... ఐస్‌ఫ్రూట్ పుల్లలతో తయారు చేసినవి. అదెలా? వాటిని కాస్త వంచినా విరిగిపోతాయి కదా అంటారా? అయితే వెంటనే తయారీని తెలుసుకోవాల్సిందే.. కావలసినవి: ఐస్‌ఫ్రూట్ పుల్లలు, వేడి నీళ్లు, వివిధ రకాల కప్పులు, రంగురంగుల పెయింట్స్, రంగురంగుల దారాలు, డిజైనరీ టేప్స్ తయారీ: ముందుగా ఈ ఐస్‌ఫ్రూట్ పుల్లలను వేడి నీళ్లలో రెండు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మీ చేతికి తగ్గ సైజులో ఉన్న కప్పును తీసుకొని, ఈ నానిన పుల్లలను కాస్త వంచి కప్పు గోడకు అమర్చాలి. తర్వాత పుల్లలు పూర్తిగా ఆరిపోయాక (గట్టిపడ్డాక) వాటిని బయటకు తీయాలి. ఇప్పుడు వాటిని ఎలాగైనా అలంకరించొచ్చు. రంగురంగుల దారాలను వంగిన పుల్లకు చుట్టాలి. అలాగే, వివిధ రంగుల పెయింట్స్‌ను పూసినా సరిపోతుంది. అంతేనా, షాపుల్లో దొరికే డిజైనరీ టేప్స్‌ను కూడా వాటికి చుట్టొచ్చు. దారాలు, టేపులే కాదు... మామూలు కలర్ స్కెచ్ పెన్నులతోనూ వీటిపై డిజైన్స్ వేసుకోవచ్చు. ఇలాంటి బ్రేస్లెట్లను చిన్నపిల్లలు, యువత బాగా ఇష్టపడతారు. మరెందుకు ఆలస్యం.. కానివ్వండి మరి. -
‘చరిత’ నడవాలని..
వజ్ర సంకల్పం మనమంతా దేవుడు చేసిన మనుషులమే.. ఒక్కోసారి ఆ దేవుడు కూడా పనిభారం ఎక్కువయ్యో ఏమోగానీ కొందరిని కొన్ని లోపాలతో పుట్టిస్తుంటాడు. కవిత, వజ్రాచారి దంపతులకూ అలాంటి ఓ బిడ్డనే ప్రసాదించాడు. అన్నీ బాగానే ఇచ్చి.. నడిచేందుకు కాళ్లను మాత్రం సరిగా ఇవ్వలేదు. ఆ దంపతులకు ఆయన మీద చాలా నమ్మకం.. ఇవ్వాళ్ల కాకపోతే రేపు.. నా బిడ్డకు దేవుడు న్యాయం చేయకపోతాడా అని. ఆ నమ్మకంతోనే వజ్రాచారి గట్టి సంకల్పం చేసి, ‘తన కూతురు కర్రసాయం లేకుండా కాళ్లతో నడవాలని... కర్రతోనే భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు ఓ తపస్సులా... ఇరవై రోజులుగా గణేశుడి తయారీలో లీనమైపోయాడు. ఈ తండ్రి కథ ఇది... ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని కావేరి నగర్లో నివాసం ఉంటున్న ఏలేటి వజ్రాచారి వడ్రంగి పనినే నమ్ముకుని దాంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వజ్రాచారి దంపతులకు ఇద్దరు బిడ్డలు ఒకేసారి పుట్టారు. చరిత, చార్మి అని పేర్లు పెట్టుకుని, ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. రెండేళ్లదాకా అంతా ఆనందంగానే సాగింది. ఆ తర్వాత.. చార్మి బుడిబుడి అడుగులు వేస్తోంది.. నడుస్తోంది.. పరుగులూ పెడుతోంది. కానీ.. తన కన్న కొన్ని నిమిషాలు పెద్దదైన చరిత మాత్రం కనీసం నిల్చోలేక పోతోంది. ‘కొంచెం పెద్దగయితే నడుస్తుందిలే..’ అని సర్దిచెప్పుకున్నారు కానీ నాలుగేళ్లయినా చరిత నడవడం లేదు. మంచానికే పరిమితమైంది. ఎన్ని ఆస్పత్రులో.. ఎన్ని గుళ్లో.. ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ ఇలా.. అన్ని పెద్దాసుపత్రులకూ తీసుకెళ్లారు. గుళ్లకు తిరిగారు. ఆమె నడవలేకపోవడానికి నరాల బలహీనత వంటి కొన్ని కారణాలున్నాయన్నారు డాక్టర్లు. చివరకు ఎవరో చెబితే, తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు చరిత కాళ్లకు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత నుంచి కర్రసాయంతో నెమ్మదిగా నడుస్తోంది చరిత. శారీరకలోపం ఉన్నా.. తన బిడ్డ చదువులో వెనుకబడకూడదన్న తపనతో ఆమెను బడికి తీసుకెళ్లాడు వజ్రాచారి. ప్రస్తుతం పదమూడేళ్ల చరిత తమ వీధిలోనే ఉండే పాఠశాలలో సెవెంత్ క్లాస్ చదువుతోంది. దేవుడు కరుణిస్తాడేమోనని.. కర్రల సాయం లేకుండా చరిత నడవాలంటే ప్రత్యక్ష దైవాలైన వైద్యుల పని పూర్తయింది. ఇక ఆ దైవానుగ్రహమే మిగిలిందని ఆ దేవుడికే ప్రాణప్రతిష్ట చేసేందుకు సిద్ధమయ్యాడు వజ్రాచారి. ఇరవై రోజుల క్రితం నిర్మల్‌లోని మల్లన్నగుట్టపై గల హరిహరక్షేత్రంలో గణపతికి పూజ చేసి సంకల్పం తీసుకున్నాడు. ‘గణపయ్యా.. నా బిడ్డ కర్రలు లేకుండా నడవాలి. అందుకోసం కర్రతో నీ విగ్రహాన్ని తయారుచేస్తా..’ అని మొక్కుకున్నాడు. ఆరోజు నుంచి నిర్విరామంగా గణనాథుడి తయారీలో నిమగ్నమయ్యాడు వజ్రాచారి. బిడ్డ కోసం భర్త తీసుకున్న దీక్షకు భార్య కవిత, తమ్ముడు ప్రసాద్ కూడా తోడయ్యారు. పూర్తిగా టేకు కర్రతో.. ‘వజ్ర’ సంకల్పంతో తయారు చేసిన గణేశుడి విగ్రహాన్ని స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్దగల సంఘభవనంలో ప్రతిష్ఠిస్తామని తెలిపారు. ఇక.. ఆ దేవుడు కరుణించడమే మిగిలి ఉంది. ఆ ఆడబిడ్డపై గణనాథుడు కరుణ కురిపించాలని మనం కూడా మనసారా వేడుకుందాం. - రాసం శ్రీధర్, నిర్మల్ రూరల్, ఆదిలాబాద్ నడిస్తే దీక్ష నెరవేరినట్లే.. దేవుడి కృపతో తాను అందరిలా నడుస్తుందన్న నమ్మకంతోనే గణపతి విగ్రహ తయారీ మొదలుపెట్టాను. ఇదే మొదటి విగ్రహమైనా మనసు నిండా స్వామిని నింపుకోవడం వల్లనేమో ఎలాంటి లోపం లేకుండా విగ్రహం తయారైంది. ఇక ఆ దేవుడు కరుణించి చరితను నడిపిస్తే.. నా దీక్ష నెరివేరినట్లే. - ఏలేటి వజ్రాచారి, చరిత తండ్రి నడకొస్తే అమ్మానాన్నలను బాగా చూసుకుంటా! నా కోసం అమ్మానాన్నా ఇంతగా తపిస్తుండటం చూస్తుంటే వాళ్ల బిడ్డగా పుట్టడటమే నా అదృష్టం అనుకుంటాను. ఆ గణేశుని దయవల్ల నాన్న కోరిక నెరవేరి.. నాకు నడక వస్తే బాగా చదివి ఉద్యోగం సాధిస్తా. అమ్మానాన్నలను బాగా చూసుకుంటా. - చరిత, ఏడో తరగతి -
చనువుగా ఉన్నందుకు కర్ర దెబ్బలు
జకార్త: ఇండోనేసియాలోని బాండ యూనివర్సిటీలో చదువుతున్న తోటి విద్యార్థితో చనువుగా ఉన్నందుకు నూర్ ఎలితా అనే విద్యార్థినిని షరియా చట్టం ప్రకారం బహిరంగంగా శిక్ష విధించారు. బాండ అసేహ్ రాష్ట్ర రాజధాని నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన మనసులను కలచివేస్తోంది. ఆ నగరంలోని బైతురాహుమిమ్ మసీదు వద్దకు నగర పోలీసులు.. ఆమెను ఈడ్చుకొచ్చి అక్కడున్న వేదికపై మోకాళ్లపై కూర్చోపెట్టారు. ఈ శిక్షను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటికే అక్కడ ఎంతోమంది నగర ప్రజలు గుమిగూడారు. ఇంతలో ముఖం నిండా ముసుగు ధరించిన ఓ వ్యక్తి వేదిక మీదకు వెదురు కర్రతో వచ్చాడు. నూర్ ఎలితా వీపు మీద టపా.. టపా అంటూ ఐదుసార్లు బలంగా కర్రతో బాదారు. ఒక్కో దెబ్బకు కలిగే బాధను తట్టుకోలేక ఆమె విలవిలలాడుతుంటే గుమిగూడిన జనం మాత్రం కేరింతలు కొట్టారు. ఐదో దెబ్బకు ఆమె నేలకరుచుకున్నారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత ఆమెతో చనువుగా ఉన్నందుకు ఆమె బాయ్ ఫ్రెండ్‌ను వేదిక మీదకు తీసుకొచ్చి సీన్ రిపీట్ చేశారు. నూర్ ఎలితాను బాదినట్టే చితక బాదారు. చుట్టూర ఉన్న జనం మళ్లీ అలాగే చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఆ తర్వాత జూదం ఆడారన్న ఆరోపణలతో ఓ నలుగురు కుర్రవాళ్లను అలాగే బాదారు. ఈ శిక్ష అమలును ప్రత్యక్షంగా వీక్షించేందుకు బాండ అసేహ్ డిప్యూటీ మేయర్ జైనల్ ఆరిఫిన్ హాజరయ్యారు. అనంతరం ఆయన అక్కడ మూగిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ శిక్ష ప్రజలందరికి గుణపాఠం కావాలని అన్నారు. ఈ శిక్ష ఈరోజుతోనే ఆగిపోవాలని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరం చేయరని ఆశిస్తున్నానని చెప్పారు. షరియా చట్టం నిబంధనల ప్రకారం పెళ్లి కాకుండా స్త్రీ, పురుషులు ఎవరూ కూడా చనువుగా ఉండరాదు. జూదం జోలికి వెళ్లకూడదు. ఇండోనేసియాలో ఒక్క బాండ రాష్ట్రంలోనే షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల బాండలో ఈ చట్టాన్ని 2003లో ప్రవేశ పెట్టారు. -
మహిళపై కర్రలతో దారుణంగా దాడి