
మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే... దర్బాయి గ్రామంలోని బద్కుహి చౌకీ ప్రాంతంలో నివశిస్తున్న వినేద్ అనే ప్రబుద్ధుడు తన తల్లిని స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు రూ. 25 వేలు ఇమ్మని అడిగాడు.
ఐతే అతడి తల్లి రూ. 15 వేలు మాత్రమే ఇచ్చింది. దీంతో వినోద్ కోపేద్రకంతో కన్నతల్లి అని కూడా లేకుండా కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తన కొడుకుకి తన నుంచి తన భర్త నుంచి డబ్బు తీసుకుంటుంటాడని కన్నీళ్లు పెట్టుకుంది.
(చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు)
Comments
Please login to add a commentAdd a comment