
లక్నో: తెల్లవారు జామున వీధి కుక్కల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఓ ఇంట్లో దూరి.. ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. వివరాలు.. బారాబంకి, రాఘోపూర్ గ్రామం.. దేవా ప్రాంతానికి చెందిన సుజిత్ కుమార్ ఈ నెల 19 తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో తన మేనల్లుడి ఇంటికి వెళ్లాడు. పూర్తిగా తెల్లవారకపోవడం.. వెలుతురు సరిగా లేకపోవడంతో సుజిత్‌ని చూసిన వీధికుక్కలు అరుస్తూ అతడి వెంటపడటం ప్రారంభించాయి.
కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు సుజిత్ ఓ ఇంట్లో దూరాడు. అయితే సుజిత్‌ని దొంగగా భావించిన సదరు కుటుంబ సభ్యులు అతడిని చితకబాదడమే కాక పెట్రోల్ పోసి నిప్పంటించారు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన సుజిత్ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. సుజిత్ మీద దాడి చేసిన ఇద్దరు యువకుల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment