లక్నో: విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జీవి ఈ భూ ప్రపంచం మీద మరోకటి ఉండదు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో చోటు చేసుకుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న యజమానురాలి మృతిని తట్టుకోలేక ఓ కుక్క ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పన్నేండేళ్ల క్రితం డాక్టర్ అనితా రాజ్ సింగ్ తన ఆస్పత్రి సమీపంలో గాయాలతో పడి ఉన్న ఓ కుక్క పిల్లను చూసింది. జాలితో దాన్ని చేరదీసి వైద్యం చేయించింది. గాయాలు మానిన తర్వాత డాక్టర్ అనిత ఆ కుక్క పిల్లను తనతో పాటు తీసుకెళ్లి.. జయ అని పేరు పెట్టి పెంచుకోసాగింది. ఈ క్రమంలో డాక్టర్ అనిత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు బుధవారం మరణించింది. ఈ క్రమంలో అనిత మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఇన్ని ఏళ్లు తనను ప్రేమగా చూసుకున్న యజమానురాలు అలా విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ కుక్క తట్టుకోలేకపోయింది. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment