Kanpur Man Killed Stray Dog Over Irked With Barking, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: మూగజీవిపై రాక్షసత్వం.. ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు

Oct 17 2022 12:07 PM | Updated on Oct 17 2022 12:59 PM

Kanpur Man Killed Stray Dog Over Irked With Barking - Sakshi

కాన్పూర్‌: స్థానికులు, సీసీటీవీ కెమెరా సాక్షిగా ఓ వ్యక్తి రాక్షసత్వానికి పాల్పడ్డాడు. తనను చూసి తదేకంగా మొరుగుతుందనే కోపంతో ఇటుక రాయితో వీధి కుక్కను కొట్టి చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఇటుక రాయితో నిద్రిస్తున్న కుక్క తలపై కొట్టడంతో.. రక్తం మడుగులో పడి అది మరణించింది. పక్కనే కొందరు చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డగించే యత్నం చేయలేదు. అయితే ఆ కుక్కలు నిద్రించిన చోట దుకాణం ఉండడం, ఆ ఓనర్‌ సీసీ టీవీ ఫుటేజీలో జరిగిన దారుణం గమనించి  పోలీసులకు సమాచారం అందించాడు. 

దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని జాకీగా గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. తనను చూసి పదే పదే మొరగడంతో తట్టుకోలేక కోపంతోనే చంపేశానని జాకీ నేరం ఒప్పుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement