తన పిల్లలకు హోం వర్క్ చేయడం సహయపడతానని కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్పారు. తాను ఎన్నికలో ప్రచారంలో ఉన్నప్పుడూ కూడా తన పిల్లలకు హోం వర్క్ చేయడంలో సహాయం చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా జరిగిన లైవ్ చాట్ సెషన్‌లో ఒక నెటిజన్ మీ పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు.
అంతేకాదు ప్రియాంక తన పిల్లలకు హోం వర్క్‌లో సహయం చేయడమే కాక ఆంటీ అంటూ వచ్చే తన పిల్లల స్నేహితులకు కూడా సహాయం చేస్తానని చెప్పారు. పైగా ఈ రోజు కూడా తాను తన కుమార్తె అసైన్‌మెంట్‌లో సహాయం చేశానని తెలిపింది. ఒక్కోసారి ఎన్నిఇకల ప్రచారం నుండి తిరిగి వచ్చినప్పుడూ తమ పిల్లల హోంవర్క్ పూర్తైయిందో లేదో నిర్ధారించడానికి తెల్లవారుజామున 3 లేక 4 గంటలకు కూర్చోవలసి వచ్చేదని చెప్పారు.
అంతేగాక తన చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీతో తీవ్రంగా గొడవపడేదాన్ని అని అన్నారు. కానీ బయటివాళ్లు ఎవరైన జోక్యం చేసుకుంటే మాత్రం తాము ఒక్కటైపోయే వాళ్లం అని చెప్పుకొచ్చారు. అయితే కోవిడ్ కారణంగా రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో చాలా పార్టీలు ఓటర్లను కనక్ట్ అవ్వడానికి వినూత్న రీతిలో ఇలా ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాంలను ఆశ్రయించాయి.
(చదవండి: చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!)
Comments
Please login to add a commentAdd a comment