చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్‌ ఫోటోలు...వీడియో వైరల్‌ | Man Found Photos Of PM Modi,CM Yogi Adityanath In Garbage | Sakshi
Sakshi News home page

Viral Video: చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్‌ ఫోటోలు... ఉ‍ద్యోగం కోల్పోయిన మున్సిపాలిటీ ఉద్యోగి

Published Sun, Jul 17 2022 7:40 PM | Last Updated on Sun, Jul 17 2022 8:24 PM

Man Found Photos Of PM Modi,CM Yogi Adityanath In Garbage - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మధరలోని ఒక స్థానిక మున్సిపాలిటి ఉద్యోగి చెత్తను సేకరించుకుంటూ వెళ్తున్నాడు. ఐతే ఆ చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాద్‌ ఫోటోలు ఉన్నాయి. దీంతో అతనికేం సంబంధం లేదు. అతను తన పనిగా చెత్తను సేకరించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్‌ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

తనకేం తెలియదని చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుంటూ వచ్చానని చెప్పాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాట్రాక్ట్‌ ఉ‍ద్యోగిని విధుల నుంచి తొలగించారు.  ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఆ చెత్తబండిలో ఉన్న ఫోటోలను గుర్తించి ప్రశ్నించిన వ్యక్తి ఆయా ఫోటోలను సదరు వ్యక్తి నుంచి తీసుకోవడమే కాకుండా గౌరవంగా నిమజ్జనం చేస్తానని చెప్పాడు. ఐతే నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పే ఏముంది, చెత్త బుట్లలో ఉంటేనేగా అతను సేకరించి తీసుకువచ్చిందని ఒకరు, పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ మరోకరు మండిపడుతూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement