ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు.
ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్‌కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్‌ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్‌గా మారింది.
పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్‌లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్‌ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.
ఆఫీస్ వద్దకే బ్యాండ్‌ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment