చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు..! | Utter Pradesh Cop Who Died Last Month But His Name Appears In Transfer List | Sakshi
Sakshi News home page

చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు..!

Published Sat, Jan 12 2019 6:29 PM | Last Updated on Sat, Jan 12 2019 6:29 PM

Utter Pradesh Cop Who Died Last Month But His Name Appears In Transfer List - Sakshi

లక్నో : చనిపోయిన వ్యక్తికి ట్రాన్సఫర్‌ ఆర్డర్‌ ఇచ్చి రికార్డ్‌ సృష్టించారు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు. వివరాలు.. సత్య నారాయణ సింగ్‌ అనే వ్యక్తి నెల రోజుల క్రితం మరణించాడు. అయితే చనిపోయే నాటికి అతను డీఎస్పీగా పని చేసున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూపీ పోలీసు ఉన్నతాధికారులు ట్రాన్సఫర్‌ లిస్ట్‌ తయారు చేశారు. అయితే ఇందులో మరణించిన సత్య నారాయణ సింగ్‌ పేరును కూడా చేర్చి.. జాబితాను ప్రకటించారు. పొరపాటును గుర్తించిన యూపీ డీజీపీ ట్విటర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన ‘ఈ రోజు ప్రచురించిన ట్రాన్సఫర్‌ లిస్ట్‌లో మరణించిన డీఎస్పీ సత్యనారాయణ పేరు ఉండటం చాలా బాధకరం. దాన్ని క్యాన్సల్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాను. కానీ ఇలాంటి తప్పులను సహించకూడదు. డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా ఈ విషయం గురించి క్షమాపణలు చెప్తున్నాను. ఇందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాక ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానం’టూ డీజీపీ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement