లక్నో : వివాహం అయ్యి ఓ రోజైనా గడవకముందే నూతన వధువుకు తలాక్ చెప్పాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జహీంగీరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. షాహే అలం అనే వ్యక్తికి ఈ నెల 13న రుక్సానా బానోతో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు అలంకు కట్నంలో భాగంగా బైక్ ఇస్తామని చెప్పారు బానో తల్లిదండ్రులు. కానీ పెళ్లి సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో బైక్ ఇవ్వలేదు. ఆగ్రహించిన అలం.. రుక్సానాకు ముమ్మార్లు తలాక్ చెప్పాడు. దాంతో రుక్సానా తండ్రి అలంతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment