![UP Government Committed To Safety Security Of All Women - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/2/yogi-adityanath.jpg.webp?itok=H8hOyAg4)
లక్నో: హత్రాస్ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని గుండా రాజ్యం అంటూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రభుత్వంపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తల్లులు, సోదరీమణుల భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అక్కాచెల్లెమ్మలకు, తల్లులకు హానీ చేయాలని భావించే వారికి ఇదే నా హామీ.. మీరు తప్పక ఫలితం అనుభవిస్తారు. మీకు ఎలాంటి శిక్ష లభిస్తుంది అంటే.. అది చూసి భవిష్యత్తులో మరేవ్వరు ఆడవారికి హానీ చేయాలని కలలో కూడా అనుకోరు. యూపీ ప్రభుత్వం ఆడవారి భద్రతకు, అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇదే మా నిబద్ధత, హామీ’ అంటూ యోగి ట్వీట్ చేశారు.(హత్రస్ నిరసనలు: అది ఫేక్ ఫోటో!)
Comments
Please login to add a commentAdd a comment