లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లోని సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది.
రతిభాన్పూర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 107 మంది మృతి చెందారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని హత్రాస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగ్రాతులకు సకాలంలో చికిత్సనందించేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆధిత్యనాద్ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఆధిత్యనాద్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.
కారణం అదేనా
కాగా స్థానిక గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి గౌరవార్థం ప్రతి ఏటా ఫుల్రాయ్ గ్రామంలో శివారాదన జరుగుతోంది. అయితే ఈ ఏడాది కూడా శివారాదన జరిగింది. ఇందులో పాల్గొనేందుకు సుమారు 20వేల మంది భక్తలు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి కారు బయలుదేరే వరకు భక్తులను వెళ్లనీయకుండా నిర్వహకులు అడ్డుకున్నారు. దీంతో నిర్వహకులు భక్తుల్ని అడ్డుకోవడం..వెనుక నుంచి ముందుకు భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీంతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబసభ్యులను అన్నీ రకాలుగా ఆదుకోవాలని ఉత్తర్ దేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎవరీ భోలే బాబా
భోలే బాబా అలియాస్ అకా నారాయణ్ సాకర్ హరి అలియాస్ నారాయణ్ హరి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలో జన్మించాడు. అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయడం ప్రారంభించాడని, ఆ సమయంలో ఆధ్యాత్మికత వైపు మళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment