Hathras district
-
విస్తుపోయే వాస్తవాలు.. జైలు జీవితం.. ఆపై ‘భోలే బాబా’గా అవతారం ఎత్తి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో నారాయాణ్ సాకార్ హరి.. అలియాస్ సాకార్ విశ్వ హరి(సూరజ్ పాల్)..‘భోలే బాబా’ లైంగిక వేధింపులకు పాల్పడిన చరిత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మంగళవారం సత్సంగ్ పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిస లాట జరిగి 121 మంది మరణించగా.. 108 మందికిపైగా తీవ్రగాయాల పాలయ్యారు. హత్రాస్‌లో జరిగిన ఈ సంఘటన, భోలేబాబా పాద దూళి కోసం ఎగబడటం, ఆయన ఆశిస్సులు తీసుకునేందుకు పోటి పడడం విషాదానికి కారణమైంది. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో భోలే బాబాపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పోలీస్ విభాగంలో పనిచేసే సమయంలో లైంగిక వేధింపులు పాల్పడి జైలు పాలయ్యాడు. ఆయనపై ఆగ్రా, ఎటావా, కస్గంజ్, ఫరూఖాబాద్, రాజస్థాన్‌తో సహా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.లైంగిక వేధింపులతో జైలు పాలై,విడుదలైన తర్వాత తన పూర్వీకుల గ్రామంలోని ఆశ్రమం ఏర్పాటు చేసి 'సాకర్ విశ్వ హరి బాబా'గా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది.#WATCH | On the Hathras stampede incident, Uttar Pradesh CM Yogi Adityanath says "Some people have the tendency to politicise such sad and painful incidents. These people have the nature of 'chori bhi aur seenazori bhi'. Everyone knows with whom the gentleman's (preacher) photos… pic.twitter.com/gNCHNJdpNz— ANI (@ANI) July 3, 2024 -
ఎవరీ ‘బోలే బాబా’?..హత్రాస్ తొక్కిసలాటకు కారణం అదేనా?
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లోని సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది.రతిభాన్పూర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 107 మంది మృతి చెందారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని హత్రాస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగ్రాతులకు సకాలంలో చికిత్సనందించేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆధిత్యనాద్ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఆధిత్యనాద్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.కారణం అదేనాకాగా స్థానిక గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి గౌరవార్థం ప్రతి ఏటా ఫుల్రాయ్ గ్రామంలో శివారాదన జరుగుతోంది. అయితే ఈ ఏడాది కూడా శివారాదన జరిగింది. ఇందులో పాల్గొనేందుకు సుమారు 20వేల మంది భక్తలు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి కారు బయలుదేరే వరకు భక్తులను వెళ్లనీయకుండా నిర్వహకులు అడ్డుకున్నారు. దీంతో నిర్వహకులు భక్తుల్ని అడ్డుకోవడం..వెనుక నుంచి ముందుకు భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీంతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబసభ్యులను అన్నీ రకాలుగా ఆదుకోవాలని ఉత్తర్ దేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరీ భోలే బాబాభోలే బాబా అలియాస్ అకా నారాయణ్ సాకర్ హరి అలియాస్ నారాయణ్ హరి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలో జన్మించాడు. అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయడం ప్రారంభించాడని, ఆ సమయంలో ఆధ్యాత్మికత వైపు మళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. -
యూపీలో మరో ఘోరం
తరచుగా ఆడవాళ్లపై నేరాలు జరిగే రాష్ట్రాల్లో అగ్ర స్థానంలో వున్న ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న మరో ఘోరమిది. కుమార్తెను వేధిస్తున్నాడని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశాడన్న కక్షతో ఆమె తండ్రిని పొట్టనబెట్టుకున్న దుండగుడి ఉదంతం సోమవారం చానెళ్లలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ చూసిన వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిరుడు అక్టోబర్‌లో అత్యాచారం ఉదంతం జరిగిన హథ్రాస్‌లోనే ఇది కూడా చోటుచేసుకోవటం గమనించదగ్గది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా వున్నాయని యోగి ఆరోపిస్తున్న సమయంలోనే బాధితురాలు తన కంఠశోష వినిపించింది. బాధితురాలి తండ్రిని హతమార్చిన దుండగులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపాలని ఈ ఘటన గురించి తెలిశాక యోగి ఆదేశించారు. మంచిదే. కానీ ఈ దారుణానికి దారితీసిన ఘటనల క్రమం గమనిస్తే దుండగుడికి అధికార యంత్రాంగం చివరివరకూ ఎంత వత్తాసుగా నిలిచిందో అర్థమ వుతుంది. 2018 జూలైలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు గౌరవ్ శర్మ, అతని ముగ్గురు అనుచరులను అరెస్టు చేయగా, 14 రోజుల్లోనే వారికి బెయిల్ వచ్చిందని బాధితురాలు చెబుతోంది. అప్పటినుంచి తనను లైంగికంగా వేధించటం అతనికి నిత్యకృత్యమైందని బాధితురాలు చెబుతోంది. అంటే మూడేళ్లుగా ఆ కుటుంబానిది అరణ్యరోదనే అవుతోంది. ఈ ఘటన విషయంలో మాత్రమే కాదు...గతంలో జరిగిన ఉదంతాల్లోనూ పోలీసుల తీరు ఇలాగే వుంది. అప్పటికి బీజేపీ ఎమ్మెల్యేగా వున్న కులదీప్ సెంగార్ 2017లో మైనర్ బాలికపై అత్యా చారానికి పాల్పడినట్టు ఆరోపణలొచ్చినా పోలీసులు అతనిపై చర్య తీసుకోలేదు. తనను అపహ రించి, పదిరోజులపాటు అత్యాచారం చేశారని ఆమె మొత్తుకున్నా, ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈలోగా బాధితురాలి తండ్రిని సెంగార్ అనుచరులు బెదిరించి, కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చి, వినలేదన్న ఆగ్రహంతో కొట్టి చంపారు. ఆ తర్వాత బాధితురాలు యోగి నివాసగృహం సమీపంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బాధితురాలి తండ్రిపై జరిగిన దౌర్జన్యం ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. చివరకు ఈ ఉదంతంలో ఐక్యరాజ్యసమితి సైతం స్పందించాకనే సెంగార్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత బీజేపీనుంచి అతన్ని బహిష్కరించగా 2019లో సెంగార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. నిరుడు హథ్రాస్ ఉదంతంలోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడింది. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదు చేసిన పక్షం రోజుల వరకూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అత్యాచారం ఆరోపణ చేర్చడానికి కూడా వెనకాడారు. ఆఖరికి తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రిలో చేరి, మరణించాక తల్లిదండ్రులు, ఇతర బంధువులు లేకుండానే రాత్రికి రాత్రి అంత్య క్రియలు జరిపించారు. అధికారానికొచ్చిన కొత్తలో రాష్ట్రంలో నేరగాళ్లను తుడిచిపెడతానని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆ తర్వాత అనేక ఎన్కౌంటర్లలో పలువురు మరణించారు. వీటిల్లో అత్యధికం బూటకపు ఎన్కౌంటర్లేనని ఆరోపణలొచ్చాయి. ఆ మాటెలావున్నా యూపీలో నేరాలు తగ్గిన దాఖలాలైతే లేవు. నిర్భయ ఉదంతం తర్వాత తీసుకొచ్చిన చట్టం అత్యంత కఠినమైనది. నేరగాళ్లకు ఉరిశిక్ష వేయటానికి కూడా వీలు కలిగించేది. అలాగే పిల్లలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేందుకు పోక్సో చట్టాన్ని మరింత కఠినం చేస్తూ సవరణలు తీసుకొచ్చారు. అది కూడా గరిష్టంగా ఉరిశిక్ష వేయడానికి వీలు కల్పిస్తోంది. కానీ వాటిని అమలు చేయాల్సిన యంత్రాంగం నిస్తేజంగా మిగిలితే ఆ చట్టాల వల్ల ప్రయోజనం ఏముంటుంది? హథ్రాస్‌లో జరిగిన తాజా ఉదంతంలో తండ్రిపై కాల్పులు జరిపారని, చావుబతుకుల్లో వున్నాడని బాధితురాలు పోలీసులకు ఫోన్లో సమాచారం అందిస్తే, ‘ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేయాల’ని సలహా ఇచ్చి వారు చేతులు దులుపుకున్నారు. బాధితులకు తక్షణ సాయం అందించటానికి, ఆపద నుంచి కాపాడటానికి ఇలాంటి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. అంతమాత్రంచేత మరో నంబర్‌కు ఫోన్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇలాంటి నిర్వా్యపకత్వమే దుండగులకు బలాన్నిస్తుంది. వారు మరిన్ని నేరాలకు పాల్పడేలా పురిగొల్పుతుంది. ఇప్పుడు నేరం జరిగాక ప్రధాన నిందితుణ్ణి అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. కానీ ఈ కేసులో ఆదినుంచీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చిన పోలీసులపై చర్యలు లేనట్టయితే ఒరిగేదేమీ వుండదు. అలాగే దుండగుడికి వెనువెంటనే బెయిల్ లభించేందుకు అనువుగా కేసును బలహీన పర్చడానికి కారకులెవరో, ఈ మూడేళ్లుగా అతని ప్రవర్తనపై ఫిర్యాదులున్నా ఆ బెయిల్ రద్దుకు ప్రయత్నించకపోవటంలోని ఆంతర్యమేమిటో వెలికితీయకపోతే ఇలాంటి ఘోరాలు ఆగవు. హథ్రాస్ తాజా ఉదంతం గురించి అలజడి రేగుతున్న సమయంలోనే అలీగఢ్‌కు చెందిన పదహారేళ్ల దళిత యువతిపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదంటూ అసెంబ్లీలో అలజడి రేగింది. ఇప్పటికైనా యోగి ప్రభుత్వం కళ్లు తెరవాలి. వేరే రాష్ట్రాలకు వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేసినప్పుడు తన ప్రభుత్వ రికార్డు ఎలావుందన్న ప్రశ్నలు తలెత్తుతాయని గ్రహించాలి. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి, చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. -
‘హాథ్రస్ కుటుంబాని’కి మూడంచెల భద్రత
న్యూఢిల్లీ: హాథ్రస్ బాధిత యువతి కుటుంబ సభ్యులకు, సాక్షులకు మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం తెలియజేసింది. హాథ్రస్ దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై సీబీఐ నిర్దిష్ట కాల పరిమితితో విచారణ నిర్వహించేలా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విచారణ జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ నివేదికను ఉత్తర ప్రదేశ్ డీజీపీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారని ప్రభుత్వం తెలిపింది. బాధిత యువతి ఇంటి చుట్టూ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, కుటుంబ సభ్యులకు, సాక్షులకు.. 16 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాపలాగా ఉన్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వ్యక్తిగత గోప్యతలో జోక్యం చేసుకో రాదని పోలీసులకు ఆదేశాలిచ్చామని, తమకు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి బాధిత కుటుంబానికి, సాక్షులకు అనుమతిచ్చినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లారు..
న్యూఢిల్లీ/లక్నో: గత రెండువారాలుగా చావుతో పోరాడుతున్న సామూహిక అత్యాచార బాధితురాలు కన్నుమూసింది. నాలుక కోసి అత్యంత దారుణంగా వ్యవహరించిన మృగాళ్ల పశుప్రవర్తనకు బలైపోయింది. ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచింది. వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో గడ్డి కోస్తున్న ఆమెను బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెపై విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో బాధితురాలిని తొలుత యూపీలోని అలీఘర్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: యువతిపై అత్యాచారం.. ) ఈ క్రమంలో సోమవారం ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా సెప్టెంబరు 14న జరిగిన ఈ పాశవిక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫిర్యాదు తీసుకోవడంలో జాప్యం చేశారంటూ పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దళిత యువతి పట్ల ఆధిపత్య కులానికి నిందితులు అమానుషానికి పాల్పడ్డారని, అత్యంత హేయమైన రీతిలో ఆమెపై లైంగిక దాడి చేసిన మృగాళ్లకు కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. సామూహిక అత్యాచార ఘటనలో తాము నలుగురిని అరెస్టు చేశామని, బాధితుల ఫిర్యాదు మేరకు సత్వరమే స్పందించామని పోలీసులు తెలిపారు. (చదవండి: వ్యభిచారం నేరం కాదు: బాంబే హైకోర్టు) మెడకు దుపట్టా చుట్టి లాక్కెళ్లారు.. ‘‘మా అమ్మ, అక్క, అన్నయ్య గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లారు. పెద్దమోపు గట్టుకుని మా అన్న ఇంటికి తిరిగి రాగా, వాళ్లిద్దరూ అక్కడే ఉండి గడ్డి కోస్తున్నారు. ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. అంతలోనే ఓ నలుగురు ఐదుగురు వ్యక్తులు వెనక నుంచి వచ్చి మెల్లగా నా సోదరి మెడ చుట్టూ దుపట్టా బిగించి.. పొలాల గుండా లాక్కెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మా అమ్మ తనను వెదుక్కుంటూ వెనకాలే పరిగెత్తింది. కాసేపటి తర్వాత అచేతన స్థితిలో పడి ఉన్న నా సోదరిని చూసింది. వాళ్లు తనను దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడ్డారు. నిజానికి పోలీసులు తొలుత మా గోడును పట్టించుకోలేదు. నాలుగైదు రోజుల తర్వాత చర్యలు తీసుకున్నారు’’అంటూ బాధితురాలి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరిని హతమార్చిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
యువతిపై అత్యాచారం.. నాలుక కోసి..
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ ప్రాంతంలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్రాస్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో ఉన్న ఆ యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఈ ఘటన సెప్టెంబర్ 14న చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయని.. నాలుకను కూడా కోసినట్లు యువతిని పరీక్షించిన డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉందని సౌకర్యాలున్న పెద్దాసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని సూచించారు. యువతి షెడ్యూల్ కులానికి చెందినది కావడం.. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు అగ్రవర్ణ కులానికి చెందినవారు కావడంతోనే మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. అయితే యువతి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు తొలుత తమకు సహకరించలేదని.. ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని యువతి సోదరుడు ఆరోపించారు. యువతి సోదరుడు మాట్లాడుతూ.. నా సోదరి తల్లితో పాటు పొలం పనులు చేయడానికి వెళ్లింది. మా పెద్దన్న అప్పటికే గడ్డి కోసుకొని ఇంటికి వచ్చాడు. అయితే గడ్డంతా ఏపుగా పెరగడంతో మా అమ్మ, చెల్లి దానిని కోసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మా చెల్లి పొలం పనులు చేస్తుండగా నలుగురు యువకులు వచ్చి ఆమె తలకు ఉన్న దుప్పటను లాగి మెడకు చుట్టి అక్కడినుంచి లాక్కెల్లారు. ఆ తర్వాత ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డ ఆ నలుగురు ఆమెపై దాడి చేసి తమ పేర్లు ఎక్కడ బయటపెడుతుందోనని బయపడి నాలుకను కోసేశారు. నా చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డవారు మా ఊరి యువకులే అని తర్వాత తెలిసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యువతి సోదరుడు ఆవేదనతో పేర్కొన్నాడు. -
'నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు'
హాత్రాస్: ఉత్తరప్రదేశ్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన 26 ఏళ్ల యువతి తాను చనిపోవడానికి ముందు రికార్డు చేసిన వీడియో బయటపడడంతో కలకలం రేగింది. హాత్రాస్ జిల్లాలో యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ఆమె భావించిందని అంతా అనుకున్నారు. అయితే చనిపోవడానికి ముందు రైలు వాష్‌రూమ్ లో సెల్‌ఫోన్ లో ఆమె రికార్డు చేసిన వీడియో ఇంటర్నేట్ లో ప్రత్యక్షమైంది. 'నేను మేజర్ని. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కానీ మా నాన్న, సోదరుడు, బంధువులు ఒప్పుకోవడం లేదు. నన్ను చంపేందుకు బలవంతంగా మా ఊరికి తీసుకెళుతున్నారు. నాకేదైనా జరిగినా.. నేను చనిపోయినా మా నాన్న, సోదరుడు, బంధువులదే బాధ్యత'ని వీడియోలో ఆమె పేర్కొంది. ఈ వీడియో ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసినట్టు హాత్రాస్ ఎస్పీ అజయపాల్ శర్మ తెలిపారు. తమ కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి, గుట్టుగా అంత్యక్రియలు చేశారు. ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు ముంబైలో నివసిస్తున్నారు. ఆమెను చంపేందుకే వారి స్వగ్రామానికి వచ్చినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.