లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో నారాయాణ్ సాకార్ హరి.. అలియాస్ సాకార్ విశ్వ హరి(సూరజ్ పాల్)..‘భోలే బాబా’ లైంగిక వేధింపులకు పాల్పడిన చరిత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
మంగళవారం సత్సంగ్ పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిస లాట జరిగి 121 మంది మరణించగా.. 108 మందికిపైగా తీవ్రగాయాల పాలయ్యారు. హత్రాస్‌లో జరిగిన ఈ సంఘటన, భోలేబాబా పాద దూళి కోసం ఎగబడటం, ఆయన ఆశిస్సులు తీసుకునేందుకు పోటి పడడం విషాదానికి కారణమైంది. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
విచారణలో భోలే బాబాపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పోలీస్ విభాగంలో పనిచేసే సమయంలో లైంగిక వేధింపులు పాల్పడి జైలు పాలయ్యాడు. ఆయనపై ఆగ్రా, ఎటావా, కస్గంజ్, ఫరూఖాబాద్, రాజస్థాన్‌తో సహా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
లైంగిక వేధింపులతో జైలు పాలై,విడుదలైన తర్వాత తన పూర్వీకుల గ్రామంలోని ఆశ్రమం ఏర్పాటు చేసి 'సాకర్ విశ్వ హరి బాబా'గా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది.
#WATCH | On the Hathras stampede incident, Uttar Pradesh CM Yogi Adityanath says "Some people have the tendency to politicise such sad and painful incidents. These people have the nature of 'chori bhi aur seenazori bhi'. Everyone knows with whom the gentleman's (preacher) photos… pic.twitter.com/gNCHNJdpNz
— ANI (@ANI) July 3, 2024
Comments
Please login to add a commentAdd a comment