
స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉత్తర్ ప్రదేశ్ ఆల్ రౌండర్ సౌరభ్ కుమార్‌ను సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో టెస్ట్‌లకు ఎంపిక చేసింది. 28 ఏళ్ల సౌరభ్ కుమార్ భారత జట్టు తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అనూహ్యంగా భారత జట్టులోకి ఏంట్రీ ఇస్తున్న సౌరభ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు. సౌరభ్ ఇప్పటి వరకు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సౌరభ్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 46 మ్యాచ్‌లు ఆడిన సౌరభ్.. 196 వికెట్లు పడగొట్టాడు.
ఈ లెప్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్.. గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత-ఏ జట్టులో భాగమై ఉన్నాడు. అదే విధంగా గతఏడాది జరగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోను సౌరభ్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ఇక రంజీ ట్రోఫీ 2019-20 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 44 వికెట్లతో పాటు, 285 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో కుల్ధీప్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 192 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్
చదవండి: Ind Vs SL: శ్రీలంకతో సిరీస్‌లకు జట్టు ప్రకటన.. కోహ్లి, పంత్ దూరం
Comments
Please login to add a commentAdd a comment