లక్నో : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గంగా యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లోని హనుమాన్ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని.. అక్కడి నుంచి ‘గంగా యాత్ర’ను ప్రారంభించారు. మూడు రోజుల పాటు స్టీమర్ బోట్ ద్వారా జరిగే 'గంగా యాత్ర' తొలి రోజున ప్రియాంక గాంధీ ప్రయాగ్ రాజ్‌లో పర్యటిస్తారు. దీనిలో భాగంగా నిర్వహించే ‘బోట్ పే చర్చా’ కార్యక్రమంలో విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చెయ్యనున్నారు. ఆ ప్రాంతాల ప్రజలతో సమావేశం అయి వారి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు.
Priyanka Gandhi Vadra at Triveni Sangam, to start 3-day long 'Ganga-yatra' from Chhatnag in Prayagraj to Assi Ghat in Varanasi, today. pic.twitter.com/A6gjtbod33
— ANI UP (@ANINewsUP) March 18, 2019
మొత్తం 140 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర ప్రయాగ్ రాజ్ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్ వరకు కొనసాగుతుంది. బుధవారం వారణాసిలోని కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని.. అక్కడి ప్రజలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొనడంతో యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. (ప్రియాంక ఎంట్రీతో మాకెలాంటి నష్టం లేదు..!)
Comments
Please login to add a commentAdd a comment