లక్నో : కట్నం కోసం కట్టుకున్న భార్య నాలుకను కోసేశాడు ఓ ప్రబుద్ధుడు. 10 రోజుల క్రితం జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ జిల్లా బర్రా ప్రాంతానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తి కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో చాలా రోజులుగా కట్నం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నవంబర్ 6న భార్యాభర్తల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది.
ఆగ్రహంతో విచక్షణ కోల్పొయిన ఆకాష్ తన భార్య నాలుకను కోసేశాడు. ఈ విషయం బయటకు రాకుడదనే ఉద్దేశంతో.. 10 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే నిర్భందించాడు. మొత్తానికి బాధితురాలి తండ్రి రావడంతో జరిగిన దారుణం వెలుగులోకొచ్చింది. అనంతరం తన తండ్రితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆకాష్ తండ్రి పోలీసు హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. దాంతో నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని ఎస్‌ఎస్‌పీ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment