అమిత్ షా
Amit Shah Ayodhya Campaign 2021 లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి కాషాయ పార్టీ సిద్ధమైంది. డిసెంబర్ 31న అయోధ్యాలో జరగనున్న ఎన్నికల ర్యాలిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్లొననున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి రామ్లాల, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించనున్నారు. ఈమేరకు షా అయోధ్య పర్యటనకు భాజపా సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మధ్య వాగ్వాదం నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అయోధ్య కేంద్రంగా మారనుంది. కాగా హోంమంత్రి అయోధ్య పర్యటన రాష్ట్రంలో రాజకీయ రగడను మరింత పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 31న షా అయోధ్య పర్యటనపై సోమవారం కూడా బీజేపీ సమావేశం నిర్వహించింది. ఒకవైపు అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులకు యూపీలోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ సర్కార్ బాధ్యతవహిస్తుందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు అందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే అయోధ్యను సాకుగా చూపి బీజేపీ మత పరమైన రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా..
Comments
Please login to add a commentAdd a comment