
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రెండు స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానికితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 12 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. లక్నో నగర శివార్లలోని కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. ఇంతలో ఒక ట్రక్కు అదుపు తప్పి వాటి సమీపంలోకి వెళ్లడంతో దాని డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి అని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కకోరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ ఎం ఖాసి అబిది తెలిపారు. (చదవండి: ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లక్నో నుంచి వస్తున్న బస్సు, ట్రక్కును అధిగమించడానికి ప్రయత్నించింది. ఆ సయమంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది’ అని తెలిపాడు. ప్రమాదం జరగినప్పుడు అక్కడే ప్రయాణిస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు కూడా గాయపడ్డాడు. రెండు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడం చూసి తనకు కళ్లు తిరగాయని.. నియంత్రణ కోల్పోవడంతో తనకు కూడా ప్రమాదం జరిగిందని ట్రక్కు డ్రైవర్ తెలిపాడు.