1993 Mumbai blast case
-
1993 పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. .. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్‌సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు. -
ఈశాన్యంలో ఆశాదీపం కాన్రాడ్ కె సంగ్మా
షిల్లాంగ్: తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, అంతర్జాతీయ యూనివర్సిటీల్లో నేర్చుకున్న బిజినెస్ పాఠాలు, గిరిజనులకు సేవ చేయాలన్న సంకల్పంతో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఈశాన్య ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తండ్రి, లోక్‌సభ దివంగత స్పీకర్ పీఏ సంగ్మా వేసిన బాటలో నడుస్తూ ఎన్పీపీని ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ పార్టీ స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారు. మణిపూర్ గిరిజనుల హక్కులను కాపాడడం కోసం అవతరించిన పార్టీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయి అధికారాన్ని దక్కించుకోవాలన్నది సంగ్మా ఆశ. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. గిటార్, పియానో వాయిస్తారు. ప్రయాణాలు చేయడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి. గిరిజనులకు ఆశాదీపంలా మారిన తమ పార్టీని వాళ్లే ఆదుకుంటారన్న వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు. బీజేపీ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి సొంతంగా పోటీకి దిగి మణిపూర్‌లోనూ అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. మేఘాలయా సీఎంగా ఉంటూనే మణిపూర్‌లో కూడా పార్టీని కింగ్‌మేకర్‌గా నిలపాలని ఆరాటపడుతున్నారు. ► పీఏసంగ్మా దంపతులకు 1978వ సంవత్సరం, జనవరి 27న మేఘాలయలోని తురాలో జన్మించారు. ► ఢిల్లీలో పెరిగారు. సెయింట్ కొలంబియాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. ► అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి బీబీఏ, లండన్ ఇంపీరియల్ కాలేజీ నుంచి ఎంబీఏ చేశారు. ► డాక్టర్ మెహతాబ్ అజితోక్‌ను పెళ్లాడిన సంగ్మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► తండ్రి పీఏ సంగ్మా ఎన్సీపీలో ఉన్నప్పుడు ఆయన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేవారు. ► 2003లో తొలిసారిగా ఎన్సీపీ నుంచి సెల్సెల్లా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 182 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ► 2008లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆర్థిక, విద్యుత్, ఐటీ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ► ఎన్నికల్లో విజయం సాధించిన పదిరోజుల్లోనే ఆర్థిక మంత్రిగా మేఘాలయ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సాధించారు. ► 2009–2013 వరకు మేఘాలయలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ► 2016 మార్చిలో సంగ్మా మరణానంతరం ఎన్పీపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది తుర లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఉపఎన్నికల బరిలోకి దిగి 1.92 లక్షల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ► 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసి మేఘాలయ సీఎం అయ్యారు. ► పీఏ సంగ్మా ఫౌండేషన్ చైర్మన్‌గా విద్య, పర్యావరణ రంగాల్లో కృషి చేస్తున్నారు. ► కిందటి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన ఎన్పీపీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. ► ముఖ్యమంత్రి ఎన్.బైరన్ సింగ్‌పై వ్యతిరేకతతో ఒకానొక దశలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని కూడా అనుకున్నారు కాన్రాడ్ సంగ్మా. ► ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌తో రాజీకొచ్చిన సంగ్మా ఈసారి కూడా తనకున్న చరిష్మా మీదే పార్టీకి అత్యధిక స్థానాలు లభించేలా వ్యూహాలు పన్నుతున్నారు. ► రాష్ట్రంలో ఎన్పీపీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న సంగ్మా మణిపూర్ ఎన్నికల భారం అంతా ఒంటి చేత్తో మోస్తున్నారు. ► హిందూ మైటీ, ముస్లిం మైటీ–పంగల్ వర్గాలకు ఎస్టీ హోదా, నాగాల సమస్యలకు శాంతియుత పరిష్కారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ వంటి అంశాలపై సంగ్మా అలుపెరుగని పోరాటమే చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్య
-
ఉత్తరప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రెండు స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానికితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 12 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. లక్నో నగర శివార్లలోని కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. ఇంతలో ఒక ట్రక్కు అదుపు తప్పి వాటి సమీపంలోకి వెళ్లడంతో దాని డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి అని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కకోరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ ఎం ఖాసి అబిది తెలిపారు. (చదవండి: ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లక్నో నుంచి వస్తున్న బస్సు, ట్రక్కును అధిగమించడానికి ప్రయత్నించింది. ఆ సయమంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది’ అని తెలిపాడు. ప్రమాదం జరగినప్పుడు అక్కడే ప్రయాణిస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు కూడా గాయపడ్డాడు. రెండు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడం చూసి తనకు కళ్లు తిరగాయని.. నియంత్రణ కోల్పోవడంతో తనకు కూడా ప్రమాదం జరిగిందని ట్రక్కు డ్రైవర్ తెలిపాడు. -
ఉత్తర్‌ప్రదేశ్‌లో 'డాక్టర్ బాంబ్' అరెస్ట్
కాన్పూర్ : పెరోల్‌పై ఉండి కనిపించకుండా పోయినా జలీస్ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు శుక్రవారం కాన్పూర్‌లో అరెస్టు చేశారు.1993 ముంబై వరుస పేళుళ్ల కేసులో జలీస్ జీవితఖైదు అనుభవిస్తున్నాడు. కాన్పూర్‌లోని మసీదు నుంచి ప్రార్థన అనంతరం బయటికి వస్తున్న జలీల్ అన్సారీ యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్సారీని లఖ్‌నవూ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 'డాక్టర్ బాంబ్'గా పేరు పొందిన 68 ఏళ్ల ముంబై పేళుళ్ల కేసులో అన్సారీ రాజస్తాన్‌లోని అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే నెల ముందు అన్సారీకి 21 రోజుల పెరోల్ రావడంతో అతని స్వస్థలమైన మోమిన్‌పూర్‌కు వచ్చాడు. కాగా జనవరి 17న అన్సారీ పెరోల్ పూర్తవడంతో ఉదయం 11 గంటల కల్లా జైలుకు రావాల్సి ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ముంబైలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కాన్పూర్‌లోని మసీదు నుంచి బయటకు వస్తున్న జలీస్ అన్సారీని అరెస్టు చేశారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో అన్సారీ బాంబులు సరఫరా చేసినట్లు తేలడంతో సుప్రీంకోర్టు అతనికి జీవితఖైదు విధించింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన సిమి, ఇండియన్ మొజాహిద్దీన్ ఉగ్రవాదులకు బాంబులు ఎలా తయారు చేయాలనే దానిపై శిక్షణ కూడా ఇచ్చాడు. 1993 జరిగిన ముంబై వరుస పేళుళ్లలో 317 మంది చనిపోగా, వందల మంది గాయపడ్డారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన మానవ హక్కుల సంఘం కౌన్సిల్ సభ్యులు
-
రాఖీలు కట్టి మురిసిన అక్కాచెల్లమ్మలు
సాక్షి, విశాఖపట్నం: అన్న వస్తున్నాడు.. ప్లీనరీలో ఈ మాట జననేత వెంట ఏ మూహుర్తాన వచ్చిందో కాని ఏ మారుమూలకెళ్లినా అందరి నోట విన్పిస్తున్న ఏకైక పదం..అన్న వస్తున్నాడు.. ఎక్కడకెళ్లినా ప్రతిధ్వనిస్తోంది. నడిచొస్తోన్న నిలువెత్తు నమ్మకాన్ని చూసేందుకు గ్రామాలకు గ్రామాలు కదిలి వస్తున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్టుగా క్షణం విరామం లేకుండా జడివాన తడిపేస్తుంటే తడిసి ముద్దవుతున్నారే తప్ప వెనకడుగు వేయడం లేదు. వేల నయనాలు అటువైపుగా వస్తున్న తమ ఆశల ప్రతిరూపాన్ని చూసేందుకు తరిచితరిచి చూస్తున్నాయి. ఆ రూపం కన్పించగానే ఆ కళ్లల్లో పట్టలేని ఆనందంతో సంబరపడుతున్నారు. దారి పొడవునా ఎదురేగి స్వాగతం పలుకుతూ కష్టాలను చెప్పుకుంటున్న వారిని చెదరని చిరునవ్వుతో అక్కున చేర్చుకుని జననేత ఓదారుస్తున్నారు. మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. ప్రజాకంటక పాలనను అంతమొందించి రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు విశాఖ పల్లెలు జనహారతులుపడుతున్నాయి. 245వ రోజైన ఆదివారం పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలో సాగింది. వరుసగా రాంబిల్లి మండలం ధారభోగాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెంకటాపురం జంక్షన్, వెంకటాపురం, గొర్లె ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపురం మీదుగా రామన్న పాలెం వరకు సాగింది. ఉదయం పూట చిరుజల్లుల్లోనే పాదయాత్ర సాగింది. ఇక మధ్యాహ్నమైతే వరుణుడు ఒకింత జోరు పెంచినా జనహోరుమాత్రం తగ్గలేదు. జననేతవెంట వేలాది అడుగులు కదం తొక్కడంతో అచ్యుతాపురం జన సంద్రాన్ని తలపించింది. రాఖీలు కట్టి మురిసిన అక్కాచెల్లమ్మలు ఆదివారం...పైగా రాఖీ పౌర్ణమి కావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఆడపడుచులైతే జగనన్నకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. జననేత తమ గ్రామానికి రాగానే అన్నా..! అంటూ ఆప్యాయంగా పిలుస్తూ రాఖీలు కట్టేందుకు పోటీపడ్డారు. దారిపొడవునా వేలాది మంది మహిళలు బారులు తీరగా ఏ ఒక్కర్ని నిరుత్సాహ పర్చకుండా ప్రతి ఒక్కరితోనూ రాఖీలు కట్టించుకుంటూ వారిని దీవిస్తూ జననేత ముందుకు సాగారు. కొంతమంది మహిళలైతే జగన్‌కు రాఖీ కట్టే సమయంలో ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అడుగడుగునా సమస్యలతోరణం ఇక పాదయాత్ర సాగిన పల్లెల్లలో దారిపొడవునా వేలాది మంది జననేత వద్ద తమ కష్టాలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మహానేత చలవ వల్లే ఆరోగ్యశ్రీలో నాకు గుండె ఆపరేషన్ అయ్యిందని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటే..వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ వల్లే మా పిల్లలకు బాగా చదివించుకోగలిగామని, వారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారంటూ ఆనందాన్ని పంచుకున్నారు. 18వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్ తెచ్చింది మీ నాయనేనని గుర్తు చేస్తూ నీవు కూడా మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు తీసుకురావాలంటూ ఆకాంక్షించారు. పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజారెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు యు.వి.రమణమూర్తి రాజు, తిప్పల నాగిరెడ్డి, అక్కరమాని విజయనిర్మల, కోలా గురువులు, రొంగలి జగన్నాథం, గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్, కాకర్లపూడి శ్రీనివాసరాజు, కుంబా రవిబాబు, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు, కాకి నిర్మలారెడ్డి, రిటైర్డ్ విజిలెన్స్ ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, రూరల్, అర్బన్ మహిళ అధ్యక్షులు పీలా వెంకటలక్ష్మి, గరికిన గౌరి, మహిళా ప్రతినిధులు పసుపులేటి ఉషాకిరణ్, శ్రీదేవి వర్మ, పీలా ఉమారాణి, సాడి పద్మారెడ్డి, జి.రోజారాణి, గెడ్డం ఉమ, బొట్ట రమాదేవి, అఫ్రోజ్, షబ్నమ్, సబీరా, జుత్తు లక్ష్మి, పంచడి పద్మ, జి.పూర్ణ, జి.జ్యోతి, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, హసీనా, భవాని, సుశీల, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఈదులపాటి డేవిడ్‌రాజు, వేణుగోపాలస్వామిరెడ్డి, మహమ్మద్ గోరేబాబు, అప్పిగట్ల సంపూర్ణ, పార్వతి, మేకా వెంకటరామిరెడ్డి, కె.నిర్మల, రాష్ట్ర నాయకులు తాడి జగన్నాథరెడ్డి, రుత్తల ఎర్రాపాత్రుడు, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, జాన్ వెస్లీ, రవిరెడ్డి, పక్కి దివాకర్, కిరణ్‌రాజు, సుధాకర్ సీతన్నరాజు, డాక్టర్ లక్ష్మీకాంత్, అద్దంకి నుంచి బి.వి.కృష్ణారెడ్డి, మళ్ల బుల్లిబాబు, గొర్లె సూరిబాబు, బోదెల గోవింద్, నెల్లిమర్ల నుంచి రఘుబాబు, నక్క రమణబాబు, నల్లపరాజు అచ్యుతరామరాజు, గుణాకర్, కోరుపోలు చిన్నారావు, కోన బుజ్జి, లాలం రాంబాబు, చేకూరి శ్రీనివాసరా>జు, శరగడ జగ్గారావు, డి.శంకరరావు, దాట్ల జానకీరాం రాజు, కదిరి నుంచి సురేష్‌రెడ్డి, గుజ్జల చల్లయ్య, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సంజు’ టీంకు షాకిచ్చిన గ్యాంగ్‌స్టర్
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన సినిమా ‘సంజు’ . పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే దర్శకుడు తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం కూడా సంజు మేకర్స్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న సీన్ 15 రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవంటూ’ తన లాయర్ ప్రశాంత్ పాండే ద్వారా అబూ సలేం ‘సంజు’ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించాడు. సంజయ్ దత్‌ను కలవనేలేదు.. ‘1993 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి తనకు అబూ సలేం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడని రణ్‌బీర్ కపూర్ చేత చెప్పించారు. అసలు నా క్లైంట్(అబూ సలేం) సంజయ్ దత్‌ను ఒక్కసారి కూడా కలవలేదు, ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదు. కాబట్టి ఆయన పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించిన ఈ సీన్‌ను 15 రోజుల్లోగా తొలగించాలి. అదే విధంగా అబూ సలేంకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలి. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ప్రశాంత్ పాండే నోటీసులో పేర్కొన్నారు. కాగా ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను దోషిగా నిర్ధారించిన టాడా ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. -
భర్తే తన ఫేవరెట్ అంటున్న నటి
అందానికే అసూయ పుట్టించే అందగత్తే ఐశ్వర్యరాయ్ బచ్చన్. ఈ మాజీ ప్రపంచ సుందరిని ఇష్టపడని వారుండరు. ఆమెతో కలిసి ఒకసారైనా నటించాలని హీరోలు అందరూ కోరుకుంటారు. మరి ఇంతకు ఈ ముద్దుగుమ్మకు ఇష్టమైన నటుడెవరో తెలుసా? ఇంకెవరు తన భర్త అభిషేక్ బచ్చనే. ఈ విషయాన్ని ఐష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు ఇష్టమైన నటుడు నా భర్త అభినే. మేమిద్దరం జంటగా నాలుగైదు సినిమాల్లో నటించాం. అభి సినిమాల్లో సాధారణ వ్యక్తిలాగే కన్పిస్తాడు. సూపర్‌స్టార్ కొడుకైనప్పటికి అభిషేక్‌లో ఆ గర్వం ఉండదు. ముక్కుసూటి మనిషి. అదే తనలో నాకు నచ్చిన విషయం. ఇప్పటికీ మా ఇద్దరితో సినిమాలు తీయడానికి దర్శకులు మంచి స్క్రిప్ట్‌లతో వస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇద్దరం ఓ సినిమా చేయబోతున్నాం. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాన’ని ఐశ్వర్యరాయ్ తెలిపారు. గతంలో వీరిద్దరూ ‘గురు’, ‘ఉమ్రావ్ జాన్’, ‘రావణ్’, ‘కుచ్ నా కహో’ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఐష్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకకు హాజరయ్యారు. తల్లీకూతుళ్లిద్దరూ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యానే ఖాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెకు జోడీగా రాజ్‌కుమార్ రావ్, అనిల్ కపూర్ నటిస్తున్నారు. మరోపక్క అభిషేక్ బచ్చన్ ‘మన్మర్జియా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
-
సరిగ్గా ఇదే రోజు.. ముంబై ఉలిక్కిపడింది
సాక్షి, ముంబై : సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో బాంబుల మోత మోగింది. ఒకటి కాదు రెందు కాదు వరుసగా 12 బాంబు పేలుళ్లతో ముంబై వణికిపోయింది. అన్యం పుణ్యం ఎరుగని 257 మందిని బలితీసుకుంటూ.. 700 మందికి పైగా గాయపర్చిన ఆ మారణహోమానికి నేటితో పాతికేళ్లు నిండాయి. 1993 మార్చి 12న ముంబై నగరంలో ముష్కర మూకలు నరమేధం సృష్టించాయి. దీనికి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మూల కారకుడని పోలీసులు నిర్ధారించారు. బాబ్రీ మసీదు కుల్చివేతకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్డీఎక్స్ను ఉపయోగించిన దాడి ఇదే. అయితే ఈ దాడులకు సంబంధించి టాడా కోర్టు 2007లో తొలి దశ విచారణ చేపట్టింది. అబూసలెం, ముస్తాఫా, కరిముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ మర్చంట్, అబ్దుల్ ఖయ్యుంలను కీలక నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ తర్వాత అబ్దుల్ ఖయ్యుంను నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. మళ్లీ 2012లో కేసు విచారించి ప్రధాన నిందితుడు యాకుబ్ మెమెన్‌కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2015 జులై 30న యాకుబ్‌ను ఉరితీశారు. బ్లాస్టింగ్స్ జరిగిన ప్రదేశాలు మహిమ్ మార్గంలోని మత్స్యకారుల కాలనీ జవేరి బజార్ ప్లాజా సినిమా సెంచరీ బజార్ కథా బజార్ హోటల్ సీ రాక్ సహార్ విమానాశ్రయం (ప్రస్తుత ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం) ఎయిర్ ఇండియా భవనం హోటల్ జుహు సెంటౌర్ వర్లి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనం పాస్ పోర్ట్ కార్యాలయం మసీదు-మండవి కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచ్ -
అబూ సలేంకు జీవిత ఖైదు
తాహిర్, ఫిరోజ్‌లకు మరణశిక్ష.. కరీముల్లాకూ యావజ్జీవం 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు ముంబై: 1993 నాటి ముంబై వరుసపేలుళ్ల కేసులో గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు ప్రత్యేక టాడా కోర్టు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. ఈ దారుణ మారణకాండలో క్రియాశీలకంగా వ్యవహరించిన.. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్లకు మరణశిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేరపూరిత కుట్రలో భాగస్వాములైన కరీముల్లాఖాన్‌కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్దిఖీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణను గత జూన్ 16న పూర్తిచేసి వీరిని దోషులుగా ప్రకటించిన కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసింది. ఫిరోజ్ ఖాన్‌కు రూ. 4.75 లక్షలు, కరీముల్లా ఖాన్‌కు రూ. 8.88 లక్షలు, తాహిర్ మర్చంట్‌కు రూ. 4.85 లక్షలు, అబూ సలేంకు రూ. 8.51 లక్షలు, రియాజ్ సిద్దిఖీకి రూ. 10వేల జరిమానా విధించింది. ఈ కేసులో దోషిగా తేలిన మరో సూత్రధారి ముస్తఫా దోసాజూన్ 28 జేజే ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాల్లేనందున అబ్దుల్ ఖయ్యూమ్‌ను విడుదల చేస్తున్నట్లు కోర్టు గతంలోనే ప్రకటించింది. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న అందరిపైనా నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించటం, హత్య తదితర అభియోగాలున్నాయి. కాగా, కోర్టు తీర్పును యావద్భారతం స్వాగతించింది. పోర్చుగల్‌తో ఒప్పందం కారణంగా.. ముంబై పేలుళ్ల వ్యూహం అమల్లో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఘటన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయారు. 2002, సెప్టెంబర్ 20న పోర్చుగల్‌లోని లిస్బన్లో ఇంటర్‌పోల్ అబూసలేం, మోనికా బేడీలను అరెస్టు చేసింది. అప్పటినుంచి అబూ సలేంను అప్పగించే విషయంలో భారత్, పోర్చుగల్ దేశాల మధ్య చర్చలు జరిగాయి. 2005లో పోర్చుగీస్ అధికారులు సలేంను భారత్‌కు అప్పగించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాల ప్రకారం ఆ దేశం అప్పగించిన ఏ దోషికైనా మరణశిక్ష విధించరాదు. అందుకే సలేంకు గురువారం కోర్టు మరణశిక్ష విధించకుండా యావజ్జీవంతో సరిపెట్టింది. కుట్ర అమల్లో అబూ సలేం కీలకం జూన్ 16న తీర్పు సందర్భంగా.. అబూ సలేం ఈ దాడిలో ప్రధాన సూత్రధారి అని ప్రాసిక్యూషన్ వాదించింది. ఇందుకు తగ్గట్లుగా ఆధారాలు చూపించింది. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం, ముస్తఫా దోసాలకు అత్యంత సన్నిహితుడైన సలేం తీసుకొచ్చిన ఆయుధాల ద్వారానే తీవ్రమైన విధ్వంసం జరిగిందని కోర్టు కూడా నిర్ధారించింది. జనాలను భయభ్రాంతులకు గురిచేశారని.. అమాయకులను హతమార్చారని మండిపడింది. 24 ఏళ్ల క్రితం నాటి పేలుళ్ల ఘటనలోనే వీరు దోషులైనా.. విచారణ ప్రారంభమయ్యాక వేర్వేరు సందర్భాల్లో వీరు అరెస్టయినందున.. ప్రధాన కేసులో భాగంగా కాకుండా ఈ ఏడుగురి కేసును కోర్టు ప్రత్యేకంగా విచారించింది. భారత్ ఉగ్రపోరుకు ఫలితమిది తీర్పును బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ఉగ్రవాదులు, కుట్రదారులు, వారికి సాయం చేసే వారిపై భారత్ చేస్తున్న పోరాటానికి ఇది ప్రతిఫలమని బీజేపీ పేర్కొంది. ‘ఉగ్రవాదాన్ని మోదీ ప్రపంచ ప్రధాన ఎజెండాగా మార్చి దీనిపై పోరాటంలో అన్ని దేశాలను ఒకేతాటిపైకి తెస్తున్నారు. ఈ తీర్పు ఉగ్రవాదులు, కుట్రదారులెవరినీ భారత్ వదిలిపెట్టదని స్పష్టం చేసింది’ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ‘ఉగ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతూ ఉంటుంది. అబూ సలేంకు జీవిత ఖైదుతో ఈ కేసులో న్యాయమే గెలిచింది. తర్వాత శిక్షలు పడాల్సింది దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్లకే ’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా పేర్కొన్నారు. అసలేం జరిగింది? 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చేశారు. దీనికి ప్రతీకారంగా దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం అనుచరులు వ్యూహం రచించారు. 1993 మార్చి12న ముంబైలో ఆర్డీఎక్స్ సాయంతో పలుచోట్ల భారీ విధ్వంసం సృష్టించారు. 13చోట్ల బాంబులను పేల్చారు. ఈ మారణకాండలో 257 మంది మృతి చెందగా.. 700 మందికి గాయాలయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా 189 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, మహ్మద్ అహ్మద్ దోసా సహా 35 మంది సూత్రధాబరులు, పాత్రధారులు పాక్ సహా పలు దేశాలకు పారిపోయారు. టైగర్ మెమన్ సోదరుడు పేలుళ్ల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన యాకూబ్ మెమన్ను జూలై 30, 2015న నాగ్‌పూర్ జైల్లో ఉరితీశారు. శిక్ష పడిన దోషులు వీళ్లే.. తాహిర్ మర్చంట్: ముంబై పేలుళ్ల పథకంలో ఈయన పాత్ర కీలకం. దుబాయ్‌లో జరిగిన ఈ నేరపూరిత కుట్ర వ్యూహరచన సమావేశాల్లో పాల్గొన్నాడు. దాడులకు పాల్పడేందుకు యువకులను గుర్తించి, వారిని రెచ్చగొట్టి, ఉగ్ర శిక్షణ నిమిత్తం వారిని పాకిస్తాన్‌కు తీసుకెళ్లాడు. దావూద్తోపాటుగా ఫిరోజ్, యాకూబ్ మెమన్, టైగర్ మెమన్‌లతో కలిసి కుట్ర అమల్లోనూ భాగమ య్యాడు. ఈ దాడులకోసం ఆయుధాలను సంపాదించేందుకు, భారత్‌లో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులు సేకరించాడు. ఫిరోజ్ అబ్దుల్ ఖాన్: పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, విస్ఫోటక వస్తువులు భారత్ చేరటంలో ఈయన పాత్ర కీలకం. కస్టమ్స్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి బోట్ల ద్వారా ఈ సామగ్రి క్షేమంగా భారత్‌కు చేరవేశాడు. పేలుళ్లు మొదలయ్యేంతవరకు అన్ని ఏర్పాట్లలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాడు. బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఫిరోజ్.. విధ్వంస ఏర్పాట్లలో ఎక్కడా లోటు జరగకుండా ప్రతిక్షణం సమీక్షించాడు. ఇందుకే అతణ్ణి ప్రధాన కుట్రదారుగా కోర్టు భావించింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకూ ఫిరోజ్ సిద్ధపడ్డాడు. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. కుట్రలో దోషుల పాత్రకు సంబంధించి వీలైనన్ని ఆధారాలున్నందున అప్రూవర్‌గా అంగీకరించబోమని స్పష్టం చేసింది. అబూ సలేం: ముంబై పేలుళ్ల విధ్వంసానికి కావాల్సిన ఆయుధాలను గుజరాత్‌లోని దిఘి నుంచి ముంబైకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించాడు. జనవరి 16న 1993లో గుజరాత్‌లోని బరూచ్‌కు వెళ్లిన అబూ సలేం.. అక్కడినుంచి మారుతీ వ్యాన్‌లో ఆయుధాలను (6 ఏకే 56 రైఫిళ్లు, బుల్లెట్లు, 100 హ్యాండ్ గ్రనేడ్లు) ముంబైకి తరలించాడు. వాటిని ముంబైలో రియాజ్ సిద్దిఖీకి చేరవేశాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇంటికెళ్లి ఆయనకు రెండు రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లు, గ్రనేడ్లు దాచమని ఇచ్చాడు. రెండ్రోజుల తర్వాత వాటిని వెనక్కు తీసుకున్నాడు. కరీముల్లా ఖాన్: పేలుళ్ల వ్యూహం అమలుకు సంబంధించిన సమావేశాలకు హాజరయ్యాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో దాచిన ఆయుధాలు, డిటొనేటర్లు, గ్రనేడ్లు, ఆర్డీఎక్స్‌లను పేలుళ్లకు ముందు ముంబైలో సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ ఉగ్ర శిక్షణ పొందాడు. రియాజ్ సిద్దిఖీ: గుజరాత్‌నుంచి ముంబైకి ఆయుధాలు, విస్ఫోటక సామాగ్రిని తీసుకురావటం కోసం వ్యాన్‌ను ఏర్పాటుచేశాడు. దీంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు అవసరమైన సాయం చేశాడు. -
'టైగర్ మెమన్ ను తీసుకొస్తేనే...'
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు సుప్రీంకోర్టు ఉరి శిక్ష ఖరారు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. మెమన్ ఉరిశిక్ష విధించడంతో బాంబు పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయం జరిగిందని పేర్కొంది. పాకిస్థాన్ కు పారిపోయిన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ ను ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా వ్యాఖ్యానించారు. తనకు విధించిన ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.