జగన్‌కు రాఖీ కడుతున్న అర్బన్ మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి. చిత్రంలో వరదు కల్యాణి అచ్యుతాపురంలో అశేష జనవాహిని మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పయాత్ర
సాక్షి, విశాఖపట్నం: అన్న వస్తున్నాడు.. ప్లీనరీలో ఈ మాట జననేత వెంట ఏ మూహుర్తాన వచ్చిందో కాని ఏ మారుమూలకెళ్లినా అందరి నోట విన్పిస్తున్న ఏకైక పదం..అన్న వస్తున్నాడు.. ఎక్కడకెళ్లినా ప్రతిధ్వనిస్తోంది. నడిచొస్తోన్న నిలువెత్తు నమ్మకాన్ని చూసేందుకు గ్రామాలకు గ్రామాలు కదిలి వస్తున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్టుగా క్షణం విరామం లేకుండా జడివాన తడిపేస్తుంటే తడిసి ముద్దవుతున్నారే తప్ప వెనకడుగు వేయడం లేదు. వేల నయనాలు అటువైపుగా వస్తున్న తమ ఆశల ప్రతిరూపాన్ని చూసేందుకు తరిచితరిచి చూస్తున్నాయి. ఆ రూపం కన్పించగానే ఆ కళ్లల్లో పట్టలేని ఆనందంతో సంబరపడుతున్నారు. దారి పొడవునా ఎదురేగి స్వాగతం పలుకుతూ కష్టాలను చెప్పుకుంటున్న వారిని చెదరని చిరునవ్వుతో అక్కున చేర్చుకుని జననేత ఓదారుస్తున్నారు. మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తున్నారు.
ప్రజాకంటక పాలనను అంతమొందించి రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు విశాఖ పల్లెలు జనహారతులుపడుతున్నాయి. 245వ రోజైన ఆదివారం పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలో సాగింది. వరుసగా రాంబిల్లి మండలం ధారభోగాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెంకటాపురం జంక్షన్, వెంకటాపురం, గొర్లె ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపురం మీదుగా రామన్న పాలెం వరకు సాగింది. ఉదయం పూట చిరుజల్లుల్లోనే పాదయాత్ర సాగింది. ఇక మధ్యాహ్నమైతే వరుణుడు ఒకింత జోరు పెంచినా జనహోరుమాత్రం తగ్గలేదు. జననేతవెంట వేలాది అడుగులు కదం తొక్కడంతో అచ్యుతాపురం జన సంద్రాన్ని తలపించింది.
రాఖీలు కట్టి మురిసిన అక్కాచెల్లమ్మలు
ఆదివారం...పైగా రాఖీ పౌర్ణమి కావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఆడపడుచులైతే జగనన్నకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. జననేత తమ గ్రామానికి రాగానే అన్నా..! అంటూ ఆప్యాయంగా పిలుస్తూ రాఖీలు కట్టేందుకు పోటీపడ్డారు. దారిపొడవునా వేలాది మంది మహిళలు బారులు తీరగా ఏ ఒక్కర్ని నిరుత్సాహ పర్చకుండా ప్రతి ఒక్కరితోనూ రాఖీలు కట్టించుకుంటూ వారిని దీవిస్తూ జననేత ముందుకు సాగారు. కొంతమంది మహిళలైతే జగన్‌కు రాఖీ కట్టే సమయంలో ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.
అడుగడుగునా సమస్యలతోరణం
ఇక పాదయాత్ర సాగిన పల్లెల్లలో దారిపొడవునా వేలాది మంది జననేత వద్ద తమ కష్టాలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మహానేత చలవ వల్లే ఆరోగ్యశ్రీలో నాకు గుండె ఆపరేషన్ అయ్యిందని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటే..వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ వల్లే మా పిల్లలకు బాగా చదివించుకోగలిగామని, వారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారంటూ ఆనందాన్ని పంచుకున్నారు. 18వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్ తెచ్చింది మీ నాయనేనని గుర్తు చేస్తూ నీవు కూడా మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు తీసుకురావాలంటూ ఆకాంక్షించారు.
పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజారెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు యు.వి.రమణమూర్తి రాజు, తిప్పల నాగిరెడ్డి, అక్కరమాని విజయనిర్మల, కోలా గురువులు, రొంగలి జగన్నాథం, గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్, కాకర్లపూడి శ్రీనివాసరాజు, కుంబా రవిబాబు, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు, కాకి నిర్మలారెడ్డి, రిటైర్డ్ విజిలెన్స్ ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, రూరల్, అర్బన్ మహిళ అధ్యక్షులు పీలా వెంకటలక్ష్మి, గరికిన గౌరి, మహిళా ప్రతినిధులు పసుపులేటి ఉషాకిరణ్, శ్రీదేవి వర్మ, పీలా ఉమారాణి, సాడి పద్మారెడ్డి, జి.రోజారాణి, గెడ్డం ఉమ, బొట్ట రమాదేవి, అఫ్రోజ్, షబ్నమ్, సబీరా, జుత్తు లక్ష్మి, పంచడి పద్మ, జి.పూర్ణ, జి.జ్యోతి, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, హసీనా, భవాని, సుశీల, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఈదులపాటి డేవిడ్‌రాజు, వేణుగోపాలస్వామిరెడ్డి, మహమ్మద్ గోరేబాబు, అప్పిగట్ల సంపూర్ణ, పార్వతి, మేకా వెంకటరామిరెడ్డి, కె.నిర్మల, రాష్ట్ర నాయకులు తాడి జగన్నాథరెడ్డి, రుత్తల ఎర్రాపాత్రుడు, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, జాన్ వెస్లీ, రవిరెడ్డి, పక్కి దివాకర్, కిరణ్‌రాజు, సుధాకర్ సీతన్నరాజు, డాక్టర్ లక్ష్మీకాంత్, అద్దంకి నుంచి బి.వి.కృష్ణారెడ్డి, మళ్ల బుల్లిబాబు, గొర్లె సూరిబాబు, బోదెల గోవింద్, నెల్లిమర్ల నుంచి రఘుబాబు, నక్క రమణబాబు, నల్లపరాజు అచ్యుతరామరాజు, గుణాకర్, కోరుపోలు చిన్నారావు, కోన బుజ్జి, లాలం రాంబాబు, చేకూరి శ్రీనివాసరా>జు, శరగడ జగ్గారావు, డి.శంకరరావు, దాట్ల జానకీరాం రాజు, కదిరి నుంచి సురేష్‌రెడ్డి, గుజ్జల చల్లయ్య, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment