
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మార్కా గ్రామంలోనే మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్‌కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్ కోసం వెళ్తున్నట్లుగా స్థానికులు పేర్కొన‍్నారు.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. ‘మార్కా గ్రామం నుంచి ఫతేపూర్ వెళ్తుండగా యమునా నదిలో పడవ బోల్తా పడింది. బోటులో ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహాయక చర‍్యలు కొనసాగుతున్నాయి.’ అని బాందా పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం?
Comments
Please login to add a commentAdd a comment