phone call data
-
హథ్రాస్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దారుణంలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. బాధితురాలు, ప్రధాన నిందితుడు ఏడాది నుంచి ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన 20 ఏళ్ల యువతి దారుణ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన సందీప్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు బాధితురాలి కుటుంబం, ప్రధాన నిందితుడి కాల్ రికార్డింగులను పరిశీలించారు. ఈ క్రమంలో బాధితురాలు ప్రధాన నిందితుడితో నిరంతరం ఫోన్ టచ్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు. బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్ నుంచి సందీప్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. సత్యేంద్ర నంబర్ 989xxxxx, సందీప్ నంబర్ 76186xxxxx మధ్య ఫోన్ కాంటాక్ట్ 2019 అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి గ్రామమైన బూల్గారి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోని చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినట్లు తెలిపారు. రెండు ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్ గోయింగ్ కాల్స్, 42 ఇన్కమింగ్ కాల్స్ మొత్తం104 కాల్స్ ఉన్నాయని రికార్డులు చూపిస్తున్నాయని తెలిపారు. బాధితురాలు, ప్రధాన నిందితులు సన్నిహితంగా ఉన్నట్లు కాల్ రికార్డులు చూపిస్తున్నాయన్నారు పోలీసులు. (యూఎన్‌ఓవి అనవసర వ్యాఖ్యలు: భారత్) సెప్టెంబర్ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. నిందితుడు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రగా హింసించినుట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్ 29న కన్ను మూసింది. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ప్రతిపక్షాలు యూపీ సర్కార్ మీద దుమ్మెత్తి పోశాయి. ప్రస్తుతం కేసును సీబీఐకి అప్పగించారు. (ఎన్నాళ్లిలా: చచ్చినా గౌరవం లేదు) -
సుశాంత్ ఆత్మహత్య: వెలుగులోకి రియా కాల్‌డేటా
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఆదేశించాక రోజురోజుకు కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ రియా ఫోన్ కాల్ డేటాను సేకరించింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా, తన కుటుంబ సభ్యులు సుశాంత్‌ను బలవంతంగా మానసిక వైద్యశాలకు పంపించాలని చూసినట్లు వెల్లడైంది. అంతేగాక సశాంత్కు రియా పదే పదే ఫోన్ చేసి వేధించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇదంతా సుశాంత్ జనవరి 20 నుంచి 24వ తేదీల్లో చండీఘర్‌లో తన సొదరి రాణితో ఉన్నప్పుడు జరిగింది. 5 రోజుల్లో దాదాపు 25 సార్లు రియా సుశాంత్‌కు ఫోన్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గతేడాది డిసెంబర్లో సుశాంత్ ఫోన్ నెంబర్ మార్చినట్లు కూడా తెలుస్తోంది. ఆ నెంబర్ నుంచి సుశాంత్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రియా, తన కుటుంబ సభ్యులు తనని మానసిక వైద్యశాలలో చేర్పించేందుకు కుట్ర చేస్తున్నారని, అది తనకు ఇష్టం లేదని చెప్పి బాధపడినట్లు తెలుస్తోంది. (చదవండి: సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం) వారి వేధింపులు తట్టుకోలేక సుశాంత్ ముంబై వదిలి హిమాచల్ ప్రదేశ్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం. ఈ క్రమంలో సుశాంత్ జవనరి 2020లో చండీఘర్‌లోని తన సోదరి రాణి ఇంటికి వెళ్లీనప్పుడు రియా పదే పదే ఫోన్ చేసి తన దగ్గరికి తిరిగి రవాలని, తనకు సహాయం చేయమని అడిగినట్లు తన కాల్ డేటాలో వెల్లడైంది. అయితే తను తప్పుడు మెడిసిన్ తీసుకోవడం వల్ల క్లాస్ట్రోఫోబియాతో బాధపడ్డాడని, రెండు రోజుల కోసం తన సోదరి రాణి వద్దకు వెళినట్లు సమాచారం. ఇటీవల రియా, తన కుటుంబ సభ్యులు సుశాంత్‌ను మానసికంగా వేధించారని, ఆత్మహత్యకు ప్రేరేపించాలే వారు సుశాంత్‌తో ప్రవర్తించినట్లు సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక రియా సుశాంత్ నుంచి 15 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. (చదవండి: సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ) -
ఫోన్‌కాలే పట్టిచ్చింది..
రాయవరం (మండపేట): ఫోన్‌కాల్ డేటా ఆధారంగా రాయవరం పోలీసులు హత్య కేసును ఛేదించారు. అదృశ్యమైన వివాహిత యర్రంశెట్టి దేవి అవివాహితుడి చేతిలో హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అదృశ్యం అనంతరం హత్యకు గురైన తీరు, మిస్టరీని ఛేదించిన విధానాన్ని రాయవరం ఎస్సై వెలుగుల సురేష్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన యర్రంశెట్టి దుర్గాదేవి(40) గత నెల 18న సామర్లకోటలోని తన సోదరుడికి డబ్బులు ఇచ్చేందుకు బయలుదేరింది. అప్పటికే ఫోన్లో పరిచయమున్న రంగంపేట మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన మురుకుర్తి వీరసుబ్రహ్మణ్యం దేవిని బిక్కవోలు మండలం బలభద్రపురంలో కలిశాడు. ఆమెను మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని సింగంపల్లిలోని తన పొలం వద్దకు తీసుకు వెళ్లాడు. శారీరకంగా కలిశాడు. రెండోసారి కలిసేందుకు దేవి అంగీకరించక పోవడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో సుబ్రహ్మణ్యం దేవి చెంపపై బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చితే విషయం బయటకు వస్తుందని భావించిన సుబ్రహ్మణ్యం తన వద్ద ఉన్న జేబురుమాలుతో దేవి మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారం, రూ.40వేల నగదును తీసుకుని మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో మూట కట్టాడు. మృతదేహంతో ఉన్న సంచిని బల్లాలమ్మ చెరువు వద్ద పంట పొలాలకు వెళ్లే తూములోకి నెట్టి ఇంటికి వచ్చేశాడు. 16 రోజుల అనంతరం.. తన భార్య సామర్లకోట వెళ్లి రాకపోవడం..బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేక పోవడంతో గత నెల 25న దేవి భర్త వెంకట్రావు రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన రాయవరం ఎస్సై వెలుగుల సురేష్ దేవి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఆమె ఫోన్‌కాల్ డేటాను సేకరించగా, చివరగా మురుకుర్తి వీరసుబ్రహ్మణం కాల్ ఉండడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఎస్సై సురేష్ వీఆర్వోలు పలివెల అబ్బాయి, పైన నాగేశ్వరరావులను వెంట బెట్టుకుని వీరసుబ్రహ్మణం ఇంటికి సింగంపల్లి వెళ్లగా నిందితుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సురేష్ విచారణ చేయగా దుర్గాదేవిని తానే హత్య చేసినట్టు మధ్యవర్తుల సమక్షంలో నేరం అంగీకరించిన సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని దాచిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. తూములో దాచిన మృతదేహాన్ని బయటకు తీయగా, కుళ్లిన స్థితిలో ఉంది. అనపర్తి సీఐ పాలా శ్రీనివాస్ సంఘటన స్థలికి చేరుకుని ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించారు. దుర్గాదేవిదేనని నిర్ధారించిన అనంతరం శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్నారు. శవ పరీక్ష చేసేందుకు పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు. హత్య కేసుగా మార్పు.. దుర్గాదేవి అదృశ్యం కేసును అనపర్తి సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు. నిందితుడు వీరసుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేశామని, అనపర్తి మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు. -
ఇంటి దొంగల పనే !
సాక్షి, తెనాలి: నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో తెనాలిలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ జూనియర్ అసిస్టెంట్ తుమ్మల కిరణ్‌కుమార్ పాత్ర స్పష్టమైంది. విజయవాడలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల్లో భారీ మొత్తంలో పట్టుబడిన రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్ఎస్) దిగుమతి చేసుకోవటం ఇందుకు నిదర్శనం. రేపల్లె ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని తుమ్మల పంచాయతీ శివారు గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం కోసమే ఆర్ఎస్ను తెప్పిస్తున్నట్టు రూఢీ అయినట్టే. గాదెవారిపాలెంలో నకిలీ మద్యానికి కీలకమైన పూర్ణిమ వైన్స్ లైసెన్సుదారుడు గుమ్మడి సాంబశివరావు, కిరణ్‌కుమార్ బినామీగా, నకిలీ మద్యం తయారీ సూత్రధారి అతడేనన్న లింకూ స్పష్టమైనట్టే. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు అక్కడ నుంచి విజయవాడకు ఆర్ఎస్ను తెప్పిస్తూ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఏజెంటు సాధుల ఆదిత్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు, అతడికి సప్లయి చేస్తున్న మహారాష్ట్ర స్మగ్లర్ వేటకు బయలుదేరి వెళ్లారు. పట్టిచ్చిన ఫోన్ కాల్ జాబితా... నకిలీ మద్యం సూత్రధారి తుమ్మల కిరణ్‌కుమార్‌కు డిపార్టుమెంటులో సంబంధాలు బలంగా ఉన్నాయి. నకిలీ మద్యం రాకెట్‌ను పట్టుకున్న రోజున, తెనాలి జూనియర్ అసిస్టెంట్ ఫోన్ కాల్ జాబితాను పరిశీలించిన అధికారులకు ఈ విషయం స్పష్టమైంది. అతడి నుంచి రేపల్లె సర్కిల్ కార్యాలయానికి దాదాపుగా అరవై కాల్స్ వెళ్లాయి. మళ్లీ అటువైపు నుంచి అదే సంఖ్యలో కాల్స్ ఇతడికీ వచ్చినట్టు తెలుసుకున్నారు. నకిలీ మద్యం సూత్రధారికి, సర్కిల్ కార్యాలయంతో ఉన్న అనుబంధంతోనే రెస్క్యూ కోసం పడరానిపాట్లు పడ్డారని ఫోన్ కాల్స్ జాబితా చెబుతోంది. పూర్వ భాగస్వామి సమాచారంతోనే..! తెనాలి జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, దుగ్గిరాల సర్కిల్లో పని చేస్తూ ‘సిండికేట్ కింగ్’గా పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్, తెనాలి డివిజనులో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. మద్యం వ్యాపారంలో వీరితో గత కాలంలో భాగస్వామిగా వ్యవహరించిన ఒకరి పక్కా సమాచారంతోనే తుమ్మల పంచాయతీ నకిలీ మద్యం రాకెట్‌ను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్/ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఛేదించగలిగారని సమాచారం. కొంచెం అప్రమత్తమైతే నాడే వెలుగులోకి.. కొల్లూరు మండలం క్రాపలో అనధికార దుకాణం పట్టుబడ్డ కేసును పట్టించుకున్నట్టయితే ఆనాడే నకిలీ మద్యం బాగోతం వెల్లడయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెనాలికి సమీపంలోని వేమూరులో లైసెన్సు దుకాణం నుంచి క్రాపలో అనధికార దుకాణం నడుపుతున్నారు. దుగ్గిరాల ఎక్సైజ్ సర్కిల్ పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ 4–5 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. అక్కడ అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తే, తెనాలి ఓవర్ బ్రిడ్జి దగ్గర్లోని వైన్స్‌లో పని చేసే శంకర్ అనే యువకుడు, తానూ కలిసి సీసాలకు మూతలు వేసి బెల్టు షాపులకు వేస్తున్నట్టు చెప్పాడు. దీనికి ముందు గతేడాది దుగ్గిరాల సర్కిల్లోని ఈమని గ్రామంలో టాస్క్‌ఫోర్స్ దాడిలో సుమారు 20 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. ఈ రెండు ఘటనల్లోనూ కీలకమైన యువకుడిని విచారిస్తే తుమ్మలకు చేరుతున్న ఆర్ఎస్, ఈ చివరకూ మద్యం రూపంలో అందుతోందని రూఢీ అయ్యేదనే వాదన ఉంది. తుమ్మల ఘటన తర్వాతనైనా అటుకేసి దృష్టి సారిస్తారో? లేదో? వేచి చూడాలి. -
లవ్ యూ డాడీ.. మిస్ యూ అన్నయ్యా..
వాట్సాప్‌లో రిషితేశ్వరి చివరి మేసేజ్‌లు సాక్షి, గుంటూరు: లవ్ యూ డాడీ.. మిస్ యూ అన్నయ్యా.. ఇవి రిషితేశ్వరి ఫోన్ నుంచి వెళ్లిన చివరి మేసేజ్‌లు. తరువాత ఫోనుతోపాటు ఆమె గొంతు కూడా మూగబోయింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాపై దృష్టి సారించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 14వ తేదీ ఆమె చనిపోయిన సమయం వరకు ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఆమెకు ఎవరెవరు ఫోన్లు చేశారు అనే వివరాలను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు. రిషితేశ్వరి జూలై 13న తల్లిదండ్రులతో, అన్నయ్య అని పిలిచే జితేంద్రతో మాత్రమే మాట్లాడింది. జితేంద్రకు మాత్రం అనేకసార్లు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడినట్లు తేలింది. జూలై 13వ తేదీ రాత్రి సినిమా హాల్ నుంచి కూడా ఆమె జితేంద్రతో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హాల్ బయటకు వచ్చిన రిషితేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లుగా కాల్ డేటాలో స్పష్టమైంది. తరువాత హాస్టల్‌కు చేరాక కూడా పలుమార్లు జితేంద్రతో ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. ఘటన జరిగిన రోజు జూలై 14వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆమె తల్లిదండ్రులు, జితేంద్రతో తప్ప ఎవరికి ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఎవరూ చేయలేదు. చివరగా మధ్యాహ్నం 12.28 గంటలకు వాట్సాప్ ద్వారా తండ్రికి, జితేంద్రకు ఒకేసారి మెసేజ్‌లు చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు పలుమార్లు జితేంద్రను విచారించినప్పటికీ ఎటువంటి కొత్త ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. ఏపీ సీఎంకు కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణకు నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు అందచేసింది. ఈ విషయాన్ని సీఎం తనను కలిసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలిపారు. మంత్రి గంటా, కమిటీ ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆదివారం ఈ నివేదికలోని ముఖ్యాంశాలను మీడియాకు వెల్లడించనున్నారు.