![Viral Video: Drunk Teacher With Beer Cans Taking Class In UP School - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/2/Teacher4.jpg.webp?itok=neWaR9FK)
ఉపాధ్యాయుడి వృత్తిలో ఉండి కూడా ఒక ప్రబుద్ధుడు దారుణమైన ఘోరానికి ఒడిగట్టాడు. విద్యార్థులుండే స్కూల్‌కి తాగుతు రావడమే కాకుండా చిన్నారుల ముందే ఒక ఖాళీ బీర్‌బాటిల్‌ని కింద పెట్టాడు. అదీకూడా విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా తాగుతూ స్కూల్‌కి రావడం అందర్నీ ఒకింత విస్తుపోయేలా చేసింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఈ ఉపాధ్యాయుడు తాగా వచ్చిందే గాక వారి ముందే ఒక ఖాళీ బీర్‌ల బాటిల్‌ని కింద పెట్టాడు. ఎవరో ఒక పక్క నుంచి వీడియో తీస్తుంటే మరో బీర్ బాటిల్‌ని దాచుకునేందుకు యత్నించి విఫలమయ్యాడు కూడా.
ఈ ఘటన స్పందించిన ఉత్తరప్రదేశ్ జిల్లా అధికారులు సదరు ఉపాధ్యాయుడిన సస్పెండ్ చేశారు. కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులోనే స్కూల్‌కి వస్తున్న టీచర్‌ని గమనించి ఈ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన డిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలి ట్విట్టర్‌లో...విద్యార్థుల ముందే తాగి వచ్చిన సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరారు.
नशे की हालत में धुत मास्टर जी बच्चे बच्चियों को पढ़ा रहे हैं। वीडियो हाथरस यूपी की बताई जा रही है। यदि बच्चों के भविष्य के सृजनहार टीचर ऐसी हरकत करें तो क्या बच्चों का भविष्य अच्छा हो सकता है? तुरंत इस टीचर पे कार्यवाही करे @Uppolice pic.twitter.com/zbCoJb5D8e
— Swati Maliwal (@SwatiJaiHind) October 2, 2022
(చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం)
Comments
Please login to add a commentAdd a comment