ముంబై: శయనీ గుప్తా ఎంత పిల్ల కాకో ముందే చెప్పేయకపోతే మీకీ సంగతి ఏమాత్రం ఆసక్తి కలిగించకపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా షారుఖ్ ఖాన్ బుద్ధి కుశలత, సామాజిక ఔన్నత్యం వంటి వ్యక్తిగత భారీ ప్రతిష్టాపనలను కూలదోసేంతగా ప్రతి ఒక్కరినీ సంసిద్ధం చేయగల ఒక శక్తిమంతమైన ప్రేరేపణ. అయితే షారుఖ్ ఖాన్ కెరియర్‌తో మాత్రమే పోల్చి చూడటం ఒక్కటే శయనీ గుప్తాను మనం పిల్ల కాకి అనడానికి మనకున్న యోగ్యత అవుతుందన్నది మొదట మనం గుర్తుంచుకోవాలి. ఇతరత్రా అన్ని విశేషాలలో ఈ అత్యుత్తమ నటి ఒక రాణిహంస. ‘స్పృహ’ అనే ఒక పెట్టుడు పేరు కనుక మనం శయనీకి పెట్టుకుంటే అది కూడా ఆమెకు మంచి వస్త్రధారణ వంటి ఒక ఆకర్షణే! గాంధీ జయంతికి షారుఖ్ పెట్టిన ఒక ట్వీట్ శయనికి తీవ్ర నిరాశను కలిగించి, ‘అది కాదు మీరు పెట్టవలసిన ట్వీట్’ అని ఆమె రీ ట్వీట్ చేయడంతో ఇప్పుడది ‘చిన్నా పెద్దా లేకపోవడం’ అనే ఒక చర్చగా ఏ దారిన పడితే ఆ దారిన పోతోంది. చదవండి: (వైరల్‌గా మారిన సయాని, షారుక్ ట్వీట్స్)
‘చెడు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు’ అని షారుఖ్ తన ట్వీట్ లో అన్నారు. ‘చెడు మాట్లాడొద్దు సరే, చెడు గురించి మాట్లాడాలి కదా’ అని శయనీ. ‘సే సంథింగ్. ది రైట్ థింగ్. నిజాన్ని నిలబెట్టేందుకు నోరెత్తమని కూడా గాంధీజీ చెప్పారు. బడుగు వర్గాలవారు, దళిత సోదరులు, దళిత అక్కచెల్లెళ్లు.. వీళ్లపై జరుగుతున్న దౌర్జన్యాలపై గళం విప్పమని అదే గాంధీజీ చెప్పారు. డోంట్ జస్ట్ షట్ యువర్ ఐస్, ఇయర్స్ అండ్ మౌత్స్’ అని షారుక్ కి శయనీ గట్టి రీట్వీట్ ఇచ్చారు. హాథ్రస్ సామూహిక అత్యాచార ఘటన గురించే ఆమె ఆవేదన, ఆగ్రహం. నిజమే, సీనియర్ హీరోలు ఎందుకనో ఆచితూచి జీవిస్తుంటారు ఏ రంగంలోనైనా. అది విధానమో, అంతమే లేని నిదానమో?! అమ్మాయ్ శయనీ.. నువ్వు గ్రేట్ పిల్లా. నువ్వే కాదులే. ఆడపిల్లలందరూ. అన్యాయాలపై పిడికిలి బిగిస్తారు. అసమర్థపు మౌనాలను వేలెత్తి చూపుతారు. (చదవండి: రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం)
Comments
Please login to add a commentAdd a comment