Sayani Gupta
-
అమ్మాయ్ శయనీ.. నువ్వు గ్రేట్ పిల్లా!
ముంబై: శయనీ గుప్తా ఎంత పిల్ల కాకో ముందే చెప్పేయకపోతే మీకీ సంగతి ఏమాత్రం ఆసక్తి కలిగించకపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా షారుఖ్ ఖాన్ బుద్ధి కుశలత, సామాజిక ఔన్నత్యం వంటి వ్యక్తిగత భారీ ప్రతిష్టాపనలను కూలదోసేంతగా ప్రతి ఒక్కరినీ సంసిద్ధం చేయగల ఒక శక్తిమంతమైన ప్రేరేపణ. అయితే షారుఖ్ ఖాన్ కెరియర్‌తో మాత్రమే పోల్చి చూడటం ఒక్కటే శయనీ గుప్తాను మనం పిల్ల కాకి అనడానికి మనకున్న యోగ్యత అవుతుందన్నది మొదట మనం గుర్తుంచుకోవాలి. ఇతరత్రా అన్ని విశేషాలలో ఈ అత్యుత్తమ నటి ఒక రాణిహంస. ‘స్పృహ’ అనే ఒక పెట్టుడు పేరు కనుక మనం శయనీకి పెట్టుకుంటే అది కూడా ఆమెకు మంచి వస్త్రధారణ వంటి ఒక ఆకర్షణే! గాంధీ జయంతికి షారుఖ్ పెట్టిన ఒక ట్వీట్ శయనికి తీవ్ర నిరాశను కలిగించి, ‘అది కాదు మీరు పెట్టవలసిన ట్వీట్’ అని ఆమె రీ ట్వీట్ చేయడంతో ఇప్పుడది ‘చిన్నా పెద్దా లేకపోవడం’ అనే ఒక చర్చగా ఏ దారిన పడితే ఆ దారిన పోతోంది. చదవండి: (వైరల్‌గా మారిన సయాని, షారుక్ ట్వీట్స్) ‘చెడు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు’ అని షారుఖ్ తన ట్వీట్ లో అన్నారు. ‘చెడు మాట్లాడొద్దు సరే, చెడు గురించి మాట్లాడాలి కదా’ అని శయనీ. ‘సే సంథింగ్. ది రైట్ థింగ్. నిజాన్ని నిలబెట్టేందుకు నోరెత్తమని కూడా గాంధీజీ చెప్పారు. బడుగు వర్గాలవారు, దళిత సోదరులు, దళిత అక్కచెల్లెళ్లు.. వీళ్లపై జరుగుతున్న దౌర్జన్యాలపై గళం విప్పమని అదే గాంధీజీ చెప్పారు. డోంట్ జస్ట్ షట్ యువర్ ఐస్, ఇయర్స్ అండ్ మౌత్స్’ అని షారుక్ కి శయనీ గట్టి రీట్వీట్ ఇచ్చారు. హాథ్రస్ సామూహిక అత్యాచార ఘటన గురించే ఆమె ఆవేదన, ఆగ్రహం. నిజమే, సీనియర్ హీరోలు ఎందుకనో ఆచితూచి జీవిస్తుంటారు ఏ రంగంలోనైనా. అది విధానమో, అంతమే లేని నిదానమో?! అమ్మాయ్ శయనీ.. నువ్వు గ్రేట్ పిల్లా. నువ్వే కాదులే. ఆడపిల్లలందరూ. అన్యాయాలపై పిడికిలి బిగిస్తారు. అసమర్థపు మౌనాలను వేలెత్తి చూపుతారు. (చదవండి: రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం) -
‘కళ్లు మూసుకోవడం కాదు మాట్లాడండి’
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వివాదానికి కారణమయ్యింది. ఈ ట్వీట్‌పై ఫోర్ మోర్ షాట్స్ ఫేమ్ నటి సయాని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు సరైన విషయాలు బోధించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు విషయం ఏంటంటే గాంధీ జయంతి సందర్భంగా షారుక్ ఖాన్ ‘ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. అది ఏంటంటే మంచి, చెడు అన్ని వేళలా పిల్లలు చెడు వినకూడదు.. చూడకూడదు.. మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు షారుక్ ఖాన్. (చదవండి: దద్దమ్మల్లారా, నేను అన్నదాంట్లో తప్పేముంది) దీనిపై సయాని గుప్తా స్పందించారు. ‘పిల్లలకు మంచి విషయాల గురించి చెప్పండి. సత్యం కోసం మాట్లాడమని గాంధీ మనకు బోధించారు. అణగారిని, దోపిడికి గురయిన మన దళిత సోదరులు, సోదరీమణుల గురించి మాట్లాడండి. మీ కళ్లను, నోటిని మూసుకోకండి.. సత్యం కోసం మాట్లాడండి’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు సయాని గుప్తా. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు తెగ ట్రెంఢ్ అవుతున్నాయి. Say something. The Right thing. Gandhi also taught us to speak up for the Truth, the downtrodden, the exploited, for our Dalit brothers and sisters. Don't just shut your ears and eyes and mouths. @iamsrk https://t.co/IChzz2k5n0 — Sayani Gupta (@sayanigupta) October 2, 2020 -
ఆ పళ్లే అన్నీ చెబుతున్నాయి!!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమకథా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ రొమాంటిక్ కింగ్‌కు తాను కూడా పెద్ద అభిమానిని అంటున్నారు నటి సయానీ గుప్తా. ఆమె నటించిన తాజా సినిమా ఆర్టికల్-15. ఈ మూవీ స్క్రీనింగ్ సందర్భంగా సయానీ.. షారుక్‌తో కలిసి ఫొటో దిగారు. షారుఖ్ ఫ్యాన్ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఈ ఫొటోనే ఎంతో ప్రత్యేకం అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. షారుఖ్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సయానీ...‘ నాకు తెలిసి ఆ పళ్లే మీ అందరికీ అన్నీ చెబుతున్నాయి అనుకుంటా!!! అమ్మాయిలను సంతోష పెట్టే ఒకే ఒక వ్యక్తి షారుఖ్. దలైలామా తర్వాతే అంతటి ప్రేమను పంచే వ్యక్తి. ఆయన ఫ్యాన్ సినిమాలో నటించినా ఫొటో మాత్రం తీసుకోలేదు. ఆ పశ్చాత్తాప భావన నన్ను వెంటాడింది. ఈరోజు మాత్రం నా ముఖంలో ఆనందం తాండవిస్తోంది. నా కనుబొమ్మలు పెద్దవవుతున్నాయి. ప్రపంచంలోని అందరు అమ్మాయిల్లోకెల్లా నన్ను అదృష్టవంతురాలిగా చేసినందుకు లవ్ యూ అంటూ సుదీర్ఘ పోస్ట్ ఉంచారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని బదాన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్లుకు ఉరిపోసుకొని మరణించిన యదార్థ సంఘటనను ప్రేరణగా తీసుకొని అనుభవ్ సిన్హా బాలీవుడ్లో ‘ఆర్టికల్ 15’ టైటిల్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరిపోసుకుని చనిపోగా మరో సోదరి అదశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం జూన్ 28వ తేదీన విడుదలవుతోంది. ఇక దేశంలోని ఏ పౌరుడి పట్ల కూడా జాతి, మత, కుల, లింగం, ప్రాంతంపరంగా విపక్ష చూపించకూడదంటూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్15’ సూచిస్తున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. View this post on Instagram I think those teeth say it all! Only one man can make women so happy. It is only @iamsrk Just the best energy one has experience after His holiness Dalai Lama. Just effervescent abundant love to offer. I told him today that I was the only one from the cast and crew of Fan that didnt have a photo with him. Cause I always thought I was too cool to go up to someone for a photo. Only to have regretted later, every time. So we made it happen this time after so many years.. and here's the mind numbing dizzy love that is coming through every muscle of my face! Even my eyebrows are going bonkers! *justsaying* You make me the happiest girl in the world! And so many people in the world! Will always love you! A post shared by Sayani (@sayanigupta) on Jun 26, 2019 at 4:59pm PDT -
'ట్రైలర్ చూశాక.. బాహుబలి చూడాలనిపించలేదు'
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాపై బాలీవుడ్ తారలు ఇంకా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. హిందీ సినిమాలను మించి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరోలెవరూ స్పందించకపోవటం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆలస్యంగా స్పందించిన షారూఖ్, సల్మాన్, ఆమిర్ లు సినిమా చూడలేదుగానీ.. బాహుబలి విజయం గర్వకారణం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా మరో బాలీవుడ్ నటి బాహుబలి సినిమాపై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి ట్రైలర్ చూశాక ఈ సినిమా చూడాలన్న ఆసక్తి కలగలేదని తెలిపారు సయానీ గుప్తా. అంతేకాదు బాహుబలి లాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినా తాను అంగీకరించనన్నారు. బాహుబలిని హాలీవుడ్ చిత్రాలతో పోల్చలేమని, అది కేవలం భారీ చిత్రం మాత్రమేనని తెలిపారు. సయానీ ప్రస్తుతం నవాజుద్ధీన్ సిద్ధికీకి జోడి హంగ్రీ సినిమాలో నటిస్తున్నారు.