ఆ పళ్లే అన్నీ చెబుతున్నాయి!! | Sayani Gupta Emotional Post On Photo With Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

లవ్‌ యూ షారుక్‌ : హీరోయిన్‌

Published Thu, Jun 27 2019 8:20 PM | Last Updated on Thu, Jun 27 2019 8:23 PM

Sayani Gupta Emotional Post On Photo With Shah Rukh Khan - Sakshi

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమకథా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ రొమాంటిక్‌ కింగ్‌కు తాను కూడా పెద్ద అభిమానిని అంటున్నారు నటి సయానీ గుప్తా. ఆమె నటించిన తాజా సినిమా ఆర్టికల్-15. ఈ మూవీ స్క్రీనింగ్‌ సందర్భంగా సయానీ.. షారుక్‌తో కలిసి ఫొటో దిగారు. షారుఖ్‌ ఫ్యాన్‌ సినిమాలో ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నప్పటికీ ఈ ఫొటోనే ఎంతో ప్రత్యేకం అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

షారుఖ్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సయానీ...‘ నాకు తెలిసి ఆ పళ్లే మీ అందరికీ అన్నీ చెబుతున్నాయి అనుకుంటా!!! అమ్మాయిలను సంతోష పెట్టే ఒకే ఒక వ్యక్తి షారుఖ్‌. దలైలామా తర్వాతే అంతటి ప్రేమను పంచే వ్యక్తి. ఆయన ఫ్యాన్‌ సినిమాలో నటించినా ఫొటో మాత్రం తీసుకోలేదు. ఆ పశ్చాత్తాప భావన నన్ను వెంటాడింది. ఈరోజు మాత్రం నా ముఖంలో ఆనందం తాండవిస్తోంది. నా కనుబొమ్మలు పెద్దవవుతున్నాయి.  ప్రపంచంలోని అందరు అమ్మాయిల్లోకెల్లా నన్ను అదృష్టవంతురాలిగా చేసినందుకు లవ్‌ యూ అంటూ సుదీర్ఘ పోస్ట్‌ ఉంచారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లోని బదాన్‌ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్లుకు ఉరిపోసుకొని మరణించిన యదార్థ సంఘటనను ప్రేరణగా తీసుకొని అనుభవ్‌ సిన్హా బాలీవుడ్‌లో ‘ఆర్టికల్‌ 15’ టైటిల్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరిపోసుకుని చనిపోగా మరో సోదరి అదశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ఈ చిత్రం జూన్‌ 28వ తేదీన విడుదలవుతోంది. ఇక దేశంలోని ఏ పౌరుడి పట్ల కూడా జాతి, మత, కుల, లింగం, ప్రాంతంపరంగా విపక్ష చూపించకూడదంటూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌15’ సూచిస్తున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

I think those teeth say it all! Only one man can make women so happy. It is only @iamsrk Just the best energy one has experience after His holiness Dalai Lama. Just effervescent abundant love to offer. I told him today that I was the only one from the cast and crew of Fan that didnt have a photo with him. Cause I always thought I was too cool to go up to someone for a photo. Only to have regretted later, every time. So we made it happen this time after so many years.. and here's the mind numbing dizzy love that is coming through every muscle of my face! Even my eyebrows are going bonkers! *justsaying* You make me the happiest girl in the world! And so many people in the world! Will always love you!

A post shared by Sayani (@sayanigupta) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement