సంఘటనా స్థలం వద్ద బాధితురాలి కుటుంబసభ్యులతో సీబీఐ బృందం(ఫైల్)
లక్నో : హథ్రస్ సంఘటనకు సంబంధించి సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బుధవారం బాధితురాలి తండ్రి, సోదరుల్ని మరోసారి విచారించనుంది. హథ్రస్‌లో ఏర్పాటు చేసిన సీబీఐ తాత్కాళిక కార్యాలయంలో వారిని ప్రశ్నించనుంది. దీనిపై సీబీఐ అధికారి అంజలి గంగావర్ మాట్లాడుతూ..‘‘ హథ్రస్‌లో ఏర్పాటు చేసిన సీబీఐ తాత్కాళిక కార్యాలయంలో బాధితురాలి కుటుంబంలోని మగవారిని ఈ బుధవారం విచారిస్తాము. ఆడవారిని గురువారం వారి ఇంటివద్దే విచారిస్తాము. విచారణ సందర్భంగా వారిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టము. విచారణ ప్రక్రియకు సంబంధించి సదరు కుటుంబానికి ఎటువంటి ఆక్షేపణలు లేవ’’ని తెలిపారు. ( హత్రస్‌లో మరో ఘోరం! )
బుధవారం బాధితురాలి వదిన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా భర్త సీబీఐ అధికారులతో మంగళవారం సంఘటనా స్థలానికి వెళ్లారు. బాధితురాలి చెప్పులు, అస్థికలు, ఇతర వస్తువులను అధికారులు వారి వెంట తీసుకెళ్లారు. నిందితుల్ని అలీఘర్ జైలు నుంచి వేరే జైలుకు మార్చండి. వాళ్లు భయపడ్డం లేదు. ఆ జైలులో వాళ్లు సొంత ఇంట్లో ఉంటున్నట్లుగా ఫీలవుతున్నార’’ని పేర్కొంది. కాగా, మంగళవారం బాధితురాలి కుటుంబసభ్యుల్నందర్ని విచారించిన సీబీఐ.. సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. వారినుంచి వివరాలను అడిగి తెలుసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment