హత్రాస్‌ ఘటన అప్‌డేట్స్‌: సుప్రీం కోర్టులో పిటిషన్‌ | Uttar Pradesh Hathras Stampede July 3rd 2024 Updates And Top Headlines In Telugu | Sakshi
Sakshi News home page

Hathras Stampede Updates: 121కి చేరిన మృతుల సంఖ్య

Published Wed, Jul 3 2024 7:18 AM | Last Updated on Wed, Jul 3 2024 2:06 PM

Uttar pradesh Hathras Stampede july 3rd 2024 Updates

Updates

  • హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి ఆదిత్య నాథ్‌ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.

హత్రాస్‌ ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్‌

  • హత్రాస్‌ తొక్కిసలాట ఘటనపై నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు  అయింది. కర్ణాటకకు చెందిన న్యాయవాది విశాల్‌ తివారీ ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును పిటిషన్‌లో కోరారు. 

      

  • సత్సంగ్‌ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని సీఎం యోగి పరిశీలించారు.

  • హత్రాస్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న తొక్కిసలాట ఘటన బాధితులను సీఎం యోగి పరామర్శించారు.

      

  • హత్రాస్‌ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పోలీసులతో పరిస్థితి సమీక్ష చేస్తున్నారు. ఘటన పరిస్థితిపై సీఎం యోగి పోలీసులతో ఆరా తీస్తున్నారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను సీఎం యోగి ప్రశ్నించారు. భక్తుల తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
     

  • సత్సంగ్‌ తొక్కిసలాట ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హత్రాస్‌ చేరుకున్నారు.

      

 

ఇది చిన్న ప్రమాదం కాదు
హత్రాస్‌ తొక్కిసలాట ఘటనపై యూపీ మంత్రి సందీప్‌ సింగ్ మీడియాతో మాట్లాడారు.‘ ఇప్పటివరకు ఈ ఘటనలో 121 మంది మృతి చెందారు. గాయపడినవారి ఆస్పత్రుల్లో  చికిత్స అందిస్తున్నాం. సీఎం యోగి ఆదిత్యనాథ్‌  ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను, బాధితులను పరామర్శించడానికి హత్రాస్‌ రానున్నారు. ఈ ఘటను కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది చిన్న ప్రమాదం కాదు’అని అన్నారు.

 

 

  • హత్రాస్‌ ఘటనా స్థలంలో ఎటువంటి ప్రత్యేకమైన ఆధారాలు లభించలేదు. భక్తులకు సంబంధించిన చెప్పులు, ష్యూస్‌ కలెక్ట్‌ చేశామని ఫోరెన్సిక్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

     

  • హత్రాస్‌ ఘటనలో సత్సంగ్‌ నిర్వాకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని అలహాబాద్‌ హైకోర్టులో బుధవారం పిల్‌ దాఖలైంది.

       

  • హత్రాస్‌ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది.  ఇప్పటివరకు 121 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని రిలీఫ్‌ కమిషనల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

      

  • ఘటన జరిగిన తర్వాత 38  స్వాధీనం  చేసుకున్నాం. అందులో 36 మంది మృతదేహాలను గుర్తించామని హాత్రాస్‌ సిటీ  ఏఎస్పీ అమ్రిత్‌ జైన్‌ తెలిపారు. లీగర్ ప్రక్రియ పూర్తి చేసి.. వారితో గ్రామాలకు, కుటుంబసభ్యులతో సహా పంపించాం.  ఇంకా రెండు మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. వారిని గుర్తించడానికి ఫొటోలు విడుదల చేశాం’అని తెలిపారు.

      

     

  • ఆశ్రమ్‌ (రామ్‌  కుటీర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌)కు భక్తులు రావడాన్ని ఆపటం లేదని హత్రాస్‌ డీప్యూటీ ఎస్పీ సునీల్‌ కుమార్‌  తెలిపారు.  ఆశ్రమానికి  భక్తులు వస్తున్నారు.. వెళ్లుతున్నారు.  ఎవరినీ ఆపటం లేదని చెప్పారు.

     

  • హత్రాస్ ఘటనా స్థలంలో ఫోరెన్సీక్‌ టీం, డాగ్‌ స్వ్కాడ్‌  ఎవిడెన్స్‌ సేకరిస్తున్నారు.

      

  • ‘పది మంది బాధిత పేషెంట్ల ఆరోగ్యం నిలకడగా ఉంది. నాలుగురిని ఆగ్రా పంపించాం. ఇప్పటివరకు  34 మంది మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి అయింది’ అని హత్రాస్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మన్‌జిత్‌ సింగ్‌  తెలిపారు.

      
     

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హత్రాస్‌ జిల్లా ఫూల్‌రాయ్‌ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 116 మంది భక్తులు మృతి చెందారు.  మృతిచెందిన 116 మంది  భక్తుల్లో ఇప్పటివరకు 72 మందిని గుర్తించినట్లు  పోలీసులులు తెలిపారు. మరోవైపు.. ఘటన స్థలంలో బుధవారం తెల్లవారుజాము నుంచే ఫొరెన్సిక్‌ బృందాలు, డాగ్ స్వ్కాడ్‌ చేరుకున్నాయి. ప్రమాద స్థలాన్ని ఫొరెన్సిక్‌ బృందాలు పరిశీస్తున్నారు. తక్కిసలాట జరిగిన వెంటనే సాకార్‌ విశ్వ హరి భోలే బాబా పరారైనట్లు తెలుస్తోంది.

 

దీనిపై హత్రాస్‌ డిప్యూటీ ఎస్పీ స్పందిస్తూ.. భోలే బాబాను ఇంకా తాము గుర్తించలేదని  తెలిపారు.  ఈఘటనపై దర్యాప్తు కొనసాగతోందని చెప్పారు. ఫూల్‌రాయ్‌ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

 

సత్సంగ్‌ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సత్సంగ్‌కు 80 వేల మంది హాజరవుతారన్న అంచనాతో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. కానీ, అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు.

 

మంగళవారం మధ్యాహ్నం ప్రవచనాలు వినేందుకు వందల మంది భక్తులు వచ్చారు. బాబా సత్సంగ్‌ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్‌ నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పడిపోయి.. ఊపిరాడక 116 మంది  మృతి  చెందారు.  మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. 

ఈ హత్రాస్‌ తొక్కిసలాట  ఘటనపై  ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి కార్యాలయం పరిహారం ప్రకటించింది. యూపీ సర్కారు కూడా అంతే మొత్తం పరిహారం ఇస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌  ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement