యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృతిచెందారు. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనలో తన 16 ఏళ్ల కుమార్తెను కోల్పోయిన ఒక తల్లి తన ఆవేదనను మీడియా ముందు వెల్లడించింది.
బాధితురాలు కమల మాట్లాడుతూ ‘మేము గత 20 ఏళ్లుగా సత్సంగానికి హాజరవుతున్నాం. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఈ దుర్ఘటనలో నేను నా కుమార్తెను కోల్పోయాను. నా కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎవరో ఫోన్ చేశారు. మేము ఆస్పత్రికి చేరుకునే సమయాకే నా కుమార్తె మరణించింది. ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా తెలిపారు’ అని పేర్కొంది.
భోలే బాబా సత్సంగం సికంద్రరావు కొత్వాలి ప్రాంతంలోని జిటి రోడ్డులోని ఫుల్రాయ్ గ్రామ సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొన్నారు. నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటుచేసుకుంది.
#WATCH | Mother of a 16-year-old who died in the Hathras stampede, Kamala says, " We have been attending the Satsang for the last 20 years and such an incident has never happened...'Parmatama' (Bhole Baba) left around 2-2:30 pm and after that, the incident happened...I lost my… pic.twitter.com/QnAazDZvAa
— ANI (@ANI) July 3, 2024
Comments
Please login to add a commentAdd a comment