హత్రాస్ ఘటన: మీడియా ముందుకొచ్చిన భోలే బాబా | Hathras Tragedy Bhole Baba Reacts On Camera Statement, Says I Am Deeply Saddened After The Incident | Sakshi
Sakshi News home page

Hathras Stampede Tragedy: మీడియా ముందుకొచ్చిన భోలే బాబా

Published Sat, Jul 6 2024 8:49 AM | Last Updated on Sat, Jul 6 2024 9:40 AM

Hathras Tragedy Bhole Baba reacts An On Camera Statement

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ‘భోలే బాబా’ సత్సంగ్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ ఘటనలో121 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత ‘భోలే బాబా’ నారాయణ్‌ శంకర్‌ హరీ పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తాజాగా ఆ బాబా మీడియా ద్వారా మాట్లాడారు.

‘జులై 2న జరిగిన ఘటన బాధాకారం. ఈ బాధను భరించే శక్తిని దేవుడు మాకివ్వాలి. తొక్కిసలాటకు కారకులైన వాళ్లెవరైనా ఉపేక్షించకూడదు. ప్రభుత్వం, అధికారం యంత్రాంగంపై నమ్మకం ఉంది. బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని కమిటీ సభ్యుల్ని కోరుతున్నా. అలాగే క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని కోరుతున్నా అని తన లాయర్‌ ఏపీ సింగ్‌ ద్వారా బోలే బాబా సందేశం పంపించారు’’.

భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని అలీగఢ్‌ ఐజీ  శలభ్‌ శుక్రవారం తెలిపారు. అయితే, సత్సంగ్‌కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ‘భోలే బాబా’పేరులో లేకపోవటం గమనార్హం.  

ఈ ఘట‌న‌లో సత్సంగ్‌ ఆర్గనైజింగ్‌ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్‌ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్‌లుగా పనిచేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు ‘ముఖ్య సేవాదర్‌’దేవప్రకాశ్ మధూకర్‌ను ఢిల్లీలో అరెస్ట్‌ చేసినట్లు హత్రాస్‌ పోలీసులు శుక్రవారం తెలిపారు.

అయితే.. పోలీసులు మధూకర్‌ను అరెస్టు చేయలేదని, ఆయనే లొంగిపోయరని ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ తెలిపారు. ‘‘ ఈ రోజు (శుక్రవారం) దేవ్‌ప్రకాశ్‌ మధూకర్‌ పోలీసులకు లొంగిపోయారు. సత్సంగ్‌ ప్రధాన నిర్వాహకుడైన దేవ్‌ ప్రకాశ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.  మేము చేసి తప్పు ఏంటీ? మా తప్పులేనప్పడు ముందస్తు బెయిల్‌ దాఖలు చేయటం లేదు. అదే విధంగా మధూకర్ హార్ట్‌ పేషెంట్‌. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.  దర్యాప్తుకు సహకరించటం కోసం ఆయన పోలీసులకు లొంగిపోయారు’’ అని న్యాయవాది ఏపీ సింగ్‌ మాట్లాడిన వీడియో విడుదల చేశారు. 

ఈ ఘటనపై  ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 90 మంది వద్ద స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుంది. ఈ ఘటపై విచారణ కోసం యూపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ ఏర్పాటు చేసింది.

చదవండి: ల‌గ్జ‌రీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్ల‌కు పైనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement