
బల్లియా: అత్యాచారాలు ఆగాలంటే తల్లిదండ్రులు తమ కూతుళ్ల్లకు మర్యాదగా ప్రవర్తించడం నేర్పించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మంచి విలువలతో మాత్రమే ఇలాంటి చర్యలు ఆగుతాయని, ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల లేదా శిక్షల వల్ల ఆగవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ధర్మం రక్షణ కల్పించడమేనని, తమ కూతుళ్ళు మర్యాదగా నడుచుకునేలా పెంచడం తల్లిదండ్రుల ధర్మమని చెప్పారు. మంచి విలువలే ఈ దేశాన్ని సస్యశ్యామలం చేస్తాయని అన్నారు. హాథ్రస్ ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment