controversial comments on rape
-
రేప్‌లు ఆగాలంటే.. అమ్మాయిలు మర్యాదగా ఉండాలి..
బల్లియా: అత్యాచారాలు ఆగాలంటే తల్లిదండ్రులు తమ కూతుళ్ల్లకు మర్యాదగా ప్రవర్తించడం నేర్పించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మంచి విలువలతో మాత్రమే ఇలాంటి చర్యలు ఆగుతాయని, ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల లేదా శిక్షల వల్ల ఆగవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ధర్మం రక్షణ కల్పించడమేనని, తమ కూతుళ్ళు మర్యాదగా నడుచుకునేలా పెంచడం తల్లిదండ్రుల ధర్మమని చెప్పారు. మంచి విలువలే ఈ దేశాన్ని సస్యశ్యామలం చేస్తాయని అన్నారు. హాథ్రస్ ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఎంపీ భార్య వేసిన ఆ జోక్ చెత్తగా ఉంది!
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకులం ఎంపీ హిబీ ఈడెన్ భార్య ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. విధిని అత్యచారంతో పోలుస్తూ.. మంగళవారం ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ‘విధి అత్యాచారం వంటిది, మీరు దానిని అడ్డుకోలేకపోతే.. ఆస్వాదించడానికి ప్రయత్నించండి' అంటూ ఆమె వేసిన జోక్ చెత్తగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పోస్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎంపీ భార్య తన వివాదాస్పద పోస్టును తొలగించారు. అంతేగాక తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. మలయాళంలో క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులం ఎంపీ భార్య అన్నా లిండా ఈడెన్.. కుండపోత వర్షాలు కొచ్చిని ముంచెత్తుతున్న తరుణంలో తమ పిల్లాడు ఇంట్లో సురక్షితంగా ఉన్నాడన్న వీడియోతో పాటు.. భర్త హిబీ ఈడెన్ డెజర్ట్ ఆస్వాదిస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లకు ఆమె జత చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో అన్నా చేసిన పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. రేప్ జోక్‌లు వద్దని, ఇటువంటి వ్యాఖ్యలు అత్యాచార బాధితులు, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చురకలు అంటించారు. దీంతో తన పోస్టును వెనక్కు తీసుకున్న ఆమె.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తాను చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. -
రేప్ ఘటనలపై రాద్ధాంతం వద్దు
లక్నో: భారత్‌లాంటి పెద్ద దేశంలో జరిగే ఒకటీ రెండు అత్యాచార ఘటనలపై అతిగా స్పందించవద్దనీ కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వ్యాఖ్యానించారు. కఠువా, ఉన్నావ్ ఘటనలతో దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బరేలీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘ఇలాంటివి జరగటం దురదృష్టకరం.. కొన్ని సార్లు వీటిని ఆపడం సాధ్యం కాదు.. భారత్ లాంటి పెద్దదేశాల్లో ఇలాంటి ఘటనలు ఒకటీ రెండు జరిగినప్పుడు వాటిపై రాద్ధాంతం చేయటం తగదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటోంది..’అని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన బరేలీ ఎంపీ సంతోష్ గంగ్వార్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. -
అత్యాచారాలను ఆపలేం: కేంద్ర మంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తతున్నవేళ కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలను అడ్డుకోలేమని, ప్రభుత్వాలు తమ వంతుగా పనిచేస్తున్నా ఇలాంటివి జరుగుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతపెద్ద దేశంలో ఒకటి రెండు జరిగితే!: భారత్ చాలా పెద్ద దేశమని, ఏదో ఒక మూలన ఒకటో, రెండో రేప్‌లు జరిగితే, వాటికి విపరీతమైన ప్రచారం కల్పించి, రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదని కేంద్ర మంత్రి గంగ్వార్ అన్నారు. ‘‘అత్యాచారాలు జరగడం దుదృష్టకరమే. అయితే కొన్ని సార్లు రేప్‌లను ఆపలేం. అవసరమైన మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంత పెద్ద దేశంలో ఒకటో రెండో, రేప్‌లు జరిగితే, ఆ విషయాన్ని రచ్చ చేయాల్సిన అవసరంలేదు’’ అని గంగ్వార్ అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పెనుదుమారం రేగుతున్నది. -
'ఇద్దరే చేస్తే గ్యాంగ్ రేప్ కాదు'
మహిళలపై అత్యాచారాల విషయంలో కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే మగవాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని ఆయన అన్నారు. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి కదులుతున్న వ్యానులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పుడు జార్జి ఇలా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ యువతి డ్యూటీ ముగిసిన తర్వాత తన పీజీ హోంకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా వాళ్లు వచ్చి ఆమెను వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లి, అత్యాచారం చేశారు. అయితే ఇంతటి దారుణమైన ఘటన విషయంలో రాష్ట్ర హోం మంత్రి స్పందించిన తీరుపట్ల జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా వ్యాఖ్యలుచేయడం సరికాదని ఆమె అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడేముందు ఏం చెబుతున్నామో ఓసారి ఆలోచించుకోవాలన్నారు. కాగా ఇంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా అత్యాచారాల విషయంలో ఇలాగే వ్యాఖ్యానాలు చేశారు. ముందు అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేస్తారని, తర్వాత వాళ్లిద్దరూ గొడవ పడినప్పుడు అత్యాచారం కేసులు పెడతారని అన్నారు. అబ్బాయిలు తప్పులు చేయడం మామూలేనని, అయితే రేప్ చేసినంత మాత్రాన ఉరి తీస్తారా అని అడిగారు. నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేయలేరని, ఒకరు రేప్ చేస్తే మిగిలిన అందరి పేర్లూ పెట్టేస్తారని వ్యాఖ్యానించారు.