హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చిన్నారులు సహా 100కి పైగా మృతి చెందారు. 150కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
రతీభాన్‌పూర్‌లో మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే భక్తులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఇటా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువస్తున్నారని.. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ త్రిపాఠి తెలిపారు.
మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్ర్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్నియూపీ సర్కార్ ప్రకటించింది.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
హత్రాస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హత్రాప్ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment