Religious events
-
సత్సంగ్‌లో మృత్యుకేళి.. 116 మంది భక్తుల దుర్మరణం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మాటలకు అందని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 116 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. వీరిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సత్సంగ్ ముగిశాక బయటకు వచ్చే క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో ఏకంగా 116 మంది మరణించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి కార్యాలయం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి.హత్రాస్: అప్పటిదాకా భోలే బాబా ప్రవచనాలు, భక్తుల కీర్తనలు, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన సత్సంగ్ నిమిషాల వ్యవధిలోనే శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచి్చన బాబా భక్తులు విగతజీవులయ్యారు. సత్సంగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్ నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక 116 మంది కన్నుమూశారు. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం. పలువురు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 89 మంది ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో భక్తులున్న సాకార్ విశ్వ హరి భోలే బాబా ఫూల్రాయ్ గ్రామంలో సత్సంగ్ నిర్వహించేందుకు స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం భక్తులకు గంటన్నరకు పైగా ఆధ్యాత్మిక బోధ చేశారు. టెంట్ లోపల నిర్వాహకులే ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్ బయట స్థానిక పోలీసులు భద్రత కలి్పంచారు. సత్సంగ్ పూర్తయిన తర్వాత వీరంతా ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. అయితే కార్యక్రమం పూర్తయ్యాక తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న బాబా ఆశీస్సులు తీసుకొనేందుకు, ఆయన అడుగులు వేసిన చోట పవిత్రమైన మట్టిని సేకరించేందుకు భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ వెల్లడించారు. సత్సంగ్ జరిగిన ప్రాంతం బురదమయంగా ఉండడంతో భక్తులు జారిపడ్డారని, దాంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని భక్తులు ఆరోపించారు. దర్యాప్తు బృందం ఏర్పాటు తొక్కిసలాట సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను, మృతదేహాలను వాహనాల్లో హత్రాస్ మెడికల్ సెంటర్‌తోపాటు సమీపంలోని ఎటాహ్ జల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విసిరేసినట్లుగా పడి ఉన్న శవాలు, వాటి చుట్టూ కూర్చొని రోదిస్తున్న కుటుంబ సభ్యుల హృదయ విదారక దృశ్యాలు కలచివేశాయి. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని, వారికి చికిత్స అందించడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఆసుపత్రిలో ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారని, ఆక్సిజన్ సదుపాయం లేదని ఆరోపించారు.ఫూల్రాయ్ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సత్సంగ్‌కు 80 వేల మంది హాజరవుతారన్న అంచనాతో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. కానీ, అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు. భోలే బాబా పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ హత్రాస్ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి కార్యాలయం పరిహారం ప్రకటించింది. యూపీ సర్కారు కూడా అంతే మొత్తం పరిహారం ఇస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.కాల్వలో ఒకరిపై ఒకరు పడిపోయారుప్రత్యక్ష సాక్షుల కథనం హాత్రాస్: తొక్కిసలాట ఘటన వివరాలను కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘‘ సత్సంగ్ అయిపోగానే అందరూ ఒక్కసారిగా ప్రాంగణం నుంచి బయటికి బయల్దేరారు. ప్రాంగణం బయట రోడ్డు ఎత్తులో నిర్మించారు. దాని కింద మురికి కాల్వ ఉంది. దూసుకొచి్చన జనం అందులో పడ్డారు. ఒకరిపై మరొకరు పడుతూనే ఉన్నారు. కింద ఉన్న వాళ్లు కూరుకుపోయి కన్నుమూశారు’’ అని శకుంతల అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘‘ సత్సంగ్‌ను రోడ్డు చివర నిలబడి ఉన్న వాళ్లను ప్రాంగణంలో కిక్కిరిసిన జనం తోసేశారు. దీంతో కొనకు ఉన్న వాళ్లు కాల్వలో పడిపోయారు.అలా అప్పటికప్పుడు ఒక పాతిక మంది ప్రాణాలుకోల్పోయారు’ అని మరో ప్రత్యక్ష సాక్షి ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. సత్సంగ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు మహేశ్ చంద్ర సైతం కార్యక్రమం నిర్వహణ విధానాన్ని తప్పుబట్టారు. ‘‘ సరైన నిర్వహణ లేకే ఈ దారుణం జరిగింది. బురదలో పడ్డ వాళ్లను జనం పరుగెడుతూ తొక్కుకుంటూ వెళ్లారు. వాళ్లను ఎవరూ అదుపుచేయలేకపోయారు. దీంతో పడిపోయిన వాళ్లు ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆయన అన్నారు. గతంలోనూ...⇒ 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంధరాదేవి ఆలయ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. 340 మందికిపైగా భక్తులు విగత జీవులయ్యారు. ⇒ 2008 సెపె్టంబర్ 30న రాజస్తాన్‌లోని జోద్పూర్ సిటీలో చాముండాదేవి ఆలయ ఉత్సవాలకు జనం భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట జరగడంతో 250 మంది వఅగీురణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.⇒ 2008 ఆగస్టు 3న హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో నైనాదేవి ఆలయంలో మత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. 162 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ⇒ 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. 115 మంది మృతిచెందారు. ⇒ 2011 జనవరి 14న కేరళలోని ఇడుక్కి జిల్లాలో శబరిమల ఆలయం సమీపంలో తొక్కిసలాటలో 104 మంది అయ్యప్ప భక్తులు కన్నుమూశారు. ⇒ 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో రామ్‌జానకి ఆలయంలో తొక్కిసలాటలో 63 మంది మృతిచెందారు. ⇒ 2003 అగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుంభమేళాలో తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు. -
UP Hathras Stampede: హత్రాస్‌లో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 100 మందికిపైగా మృతి (ఫొటోలు)
-
హత్రాస్‌లో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 100కి పైగా మృతి
హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చిన్నారులు సహా 100కి పైగా మృతి చెందారు. 150కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.రతీభాన్‌పూర్‌లో మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే భక్తులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఇటా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువస్తున్నారని.. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ త్రిపాఠి తెలిపారు.మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్ర్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్నియూపీ సర్కార్ ప్రకటించింది.ప్రధాని మోదీ దిగ్భ్రాంతిహత్రాస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హత్రాప్ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
కేరళలో కరోనా విజృంభణ: ప్రభుత్వ కమిటీ కీలక వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడంపై ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగానే కోవిడ్-19 కేసుల ఉధృతి పెరిగిందని ఇండియన్ సార్స్-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే కేరళ మెరుగ్గా ఉన్నా మతపరమైన సమావేశాలకు అనుమతించడం సరైన నిర్ణయం కాదని, కేరళ ప్రభుత్వం కేవలం అవసరమైన సేవలను మాత్రమే తిరిగి ప్రారంభించాల్సి ఉందని అగర్వాల్ వ్యాఖ్యానించారు. మతపరమైన సమావేశాలు, ధార్మిక సామూహిక కార్యక్రమాల కారణంగానే 13-20 వేల వరకు రోజువారి కేసులు పెరిగాయన్నారు. దీన్ని నివారించకపోతే కేసులు పెరుగుతూనే ఉంటుందని అగర్వాల్ హెచ్చరించారు. కేరళలో కరోనా కొత్త వేరియంట్ దేనినీ గర్తించనప్పటికీ, నమూనాల్లో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్వేననని తేలిందన్నారు. దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్లోకరోనా మూడోదశ రావచ్చునని అనురాగ్ అగర్వాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో వాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్నవారు మళ్లీ వైరస్‌కు గురి కారు కనుక మూడో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ తన రూపాన్ని మార్చుకుంటే ఈ ధోరణి మారుతుందని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 31 వరకు స్పెషల్ టీకా డ్రైవ్ మరోవైపు రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఎక్కువైమందికి టీకా అందించే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ టీకా డ్రైవ్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందన్నారు. వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను ప్రజలకు అందించాలని వాణిజ్య, ప్రజా సంస్థలను విజయన్ పిలుపునిచ్చారు. కాగా కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేవలం కేరళ రాష్ట్రం నుంచే 40 శాతానికి పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం ఆదివారం కేరళలో కొత్తగా 18,607 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 93 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు13.87 శాతానికి చేరింది. -
తీరని విషాదం: తొక్కిసలాటలో 44 మంది మృతి
జెరూసలెం: పవిత్ర పండుగ వేళ తొక్కిసలాట జరిగి 44 మంది మృతి చెందారు. భయాందోళనతో పరుగులు తీయడంతో తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన ఇజ్రాయెల్ దేశంలోని మౌంట్ మెరోన్ పవిత్ర స్థలం వద్ద చోటుచేసుకుంది. లాగ్ బౌమర్ పండుగ గురువారం యూదులు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి పవిత్ర స్థలం అయిన మౌంట్ మెరోన్ వద్దకు పెద్ద ఎత్తున యూదులు చేరుకున్నారు. ఉమ్మడిగా ప్రార్థనలు, నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ సమయంలో కొందరు మెట్లపై అదుపు తప్పి కిందపడ్డారు. కింద ఉన్నవారిపై వీరు పడడంతో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో అందరూ భయాందోళన చెంది పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. వేలాది మంది పరుగులు పెట్టడంతో తొక్కిసలాటలో కిందపడ్డవారు ప్రాణాలు కోల్పోయారు. ఆ పవిత్ర స్థలం ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. చెప్పులు.. బట్టలు చిందరవందరగా పడి హృదయ విదారకంగా మారింది. తొక్కిసలాటలో ఊపిరాడక ఏకంగా 44 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇక తీవ్రంగా గాయపడిన 108 మందిని ఆస్పత్రికి తరలించారని ఆ దేశానికి చెందిన అధికారులు ప్రకటించారు. వారిలో 40 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నెతన్యాహు సందర్శించారు. ఈ ఘటనపై పలు దేశాల ప్రముఖులు కూడా స్పందించి సంతాపం ప్రకటించారు. అయితే ఈ వేడుకలో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. In Israel, at least 44 people have been killed in a stampede at a religious festival, where ultra-Orthodox Jews had come together for an all-night prayer and dance celebration. pic.twitter.com/6ivY1YR6cQ — DW News (@dwnews) April 30, 2021 -
60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్
భోపాల్ : విదేశాలకు చెందిన 60 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను భోపాల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విదేశీయుల చట్టం నిబంధన ఉల్లంఘించి పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనందున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఉజ్బెకిస్తాన్, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్.. దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారు ఉన్నారు. అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులు వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా భోపాల్‌లోని పలు పోలీసు స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా భోపాల్ ఐజీ ఉపేంద్ర జైన్ తెలిపారు. (చదవండి : అహ్మదాబాద్‌లో 700 మంది సూపర్ స్ప్రెడర్స్) అరెస్ట్ అయినవారిలో కొందరికి ఇదివరకే కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దీంతో అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులందరినీ క్వారంటైన్లో ఉంచినట్టు చెప్పారు. కాగా, టూరిస్ట్ వీసాల మీద భారత్‌కు వచ్చిన విదేశీ తబ్లిగీ సభ్యులు నిబంధనులకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా సమాచారం ఉండటంతోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తబ్లిగీ సభ్యులు బెయిల్ పిటిషన్‌ను భోపాల్‌లోని లోకల్ కోర్టు తిరస్కరించింది. (చదవండి : కరోనా వ్యాప్తిపై కొత్తలెక్క!) -
వైభవంగా హులిగమ్మదేవి మహారథోత్సవం
దక్షిణ కర్ణాటకలో ఆదిశక్తి దేవతగా ప్రఖ్యాతి గాంచిన కొప్పళ జిల్లాలోని హులిగిలో వెలసివున్న హులిగమ్మదేవి మహారథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత ఘనం గా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారిని పూల మాలలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. అక్కిపడె తదితర ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని పల్లకిలో రథం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారిని రథంపై ఉంచి రథాన్ని లాగారు. రథంపైకి భక్తులు పూలు, పండ్లను విసిరి మొక్కులు తీర్చుకొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. - హొస్పేట -
టీటీడీకే పంగనామాలు !
దోడ్డి దారిలో ఉద్యోగాలకు సిఫార్సులు చక్రం తిప్పుతున్న ఇంటి దొంగలు ఎఫ్ఎం రేడియోలో ఇదీ సంగతి తిరుపతి సిటీ: శ్రీవారి ప్రాముఖ్యతను దశ దిశలా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఎస్వీబీసీ, వెంకటేశ్వర ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియోను నిర్వహిస్తోంది. స్థానికంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో శ్రోతలను భక్తిమార్గం వైపు తీసుకెళ్లేందుకు 2007లో రేడియోను తీసుకొచ్చారు. అప్పటి నుంచీ వివాదాలను మూటగట్టుకుంటోంది. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న వారిదే ఇష్టారాజ్యంగా మారిపోయింది. భక్తి కార్యక్రమాలు పలికించేందుకు అప్పట్లో నందిని, కీర్తి, సుగుణ, కుమారి, శివయ్యలను నియమించారు. వాళ్లు ఎవరో కూడా ఇక్కడి అధికారులకు తెలియదు. వారి పేరుపై భక్తి కార్యక్రమాలకు బినామీలు వాయిస్ అందిస్తున్నారు. అసలు వీళ్లను ఎవరు నియమించారో కూడా తెలియని పరిస్థితి. అక్కడ పెత్తనం అంతా వారిదే. అడిగితే వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు. రికార్డుల్లో ఉన్నవారి పారితోషకం మాత్రం వీరు తీసుకుంటున్నారు. ఇప్పుడేమో తాజా ప్రతిపాదనలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో ఉద్యోగులుగా వ్యవహరిస్తున్న ముగ్గురిని రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో కొత్తగా ఇద్దరు ప్రోగ్రామ్ ప్రొడక్షన్ అసిస్టెంట్లను తీసుకోవాలని టీటీడీ ఈవో, జేఈవోలకు ప్రతిపాదనలు పంపారు. ప్రతి ఒక్కరికీ నెలకు రూ.15 వేలు పారితోషకం చెల్లించే విధంగా ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ స్టాఫ్‌గా పనిచేస్తున్న సీనియర్లను పక్కకు నెట్టి దొడ్డిదారిలో నియామకాలకు తెరతీశారు. టీటీడీ యాజమాన్యం వెంకటేశ్వర ఎఫ్ఎం రేడియో కమ్యూనిటీలో ఏమి జరుగుతుందో పట్టించుకోవాలని సిబ్బంది వేడుకుంటున్నారు. టీటీడీ విజిలెన్స్ ఆరా .. వారం రోజుల కిందట ఇక్కడ జరుగుతున్న తతంగంపై టీటీడీ విజిలెన్సు విభాగం ఆరా తీసింది. రికార్డులను పరిశీలించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ అన్ని తామై నడిపిస్తున్న అధికారులు ఈ గడ్డు పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియక ఉన్నతాధికారుల వద్ద పంచాయితీ చేస్తున్నట్లు సమాచారం. సూచనల మేరకే పనిచేస్తున్నాం.. దీనిపై ఇన్చార్జి, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్ను వివరణ కోరగా ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నట్లు బినామీ పేర్లపై ఎవరూ పనిచేయడం లేదని తెలిపారు. రికార్డుల ప్రకారం వార్షిక బడ్జెట్ తయారుచేస్తున్నామని చెప్పారు. నూతన నియామకాల విషయంలో ఈవో, జేఈవో సూచనలను పాటిస్తున్నామని తెలిపారు.