ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : విదేశాలకు చెందిన 60 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను భోపాల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విదేశీయుల చట్టం నిబంధన ఉల్లంఘించి పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనందున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఉజ్బెకిస్తాన్, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్.. దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారు ఉన్నారు. అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులు వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా భోపాల్‌లోని పలు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదైనట్టుగా భోపాల్ ఐజీ ఉపేంద్ర జైన్ తెలిపారు. (చదవండి : అహ్మదాబాద్‌లో 700 మంది సూపర్ స్ప్రెడర్స్)
అరెస్ట్ అయినవారిలో కొందరికి ఇదివరకే కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దీంతో అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులందరినీ క్వారంటైన్‌లో ఉంచినట్టు చెప్పారు. కాగా, టూరిస్ట్ వీసాల మీద భారత్‌కు వచ్చిన విదేశీ తబ్లిగీ సభ్యులు నిబంధనులకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా సమాచారం ఉండటంతోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తబ్లిగీ సభ్యులు బెయిల్ పిటిషన్‌ను భోపాల్‌లోని లోకల్ కోర్టు తిరస్కరించింది. (చదవండి : కరోనా వ్యాప్తిపై కొత్తలెక్క!)
Comments
Please login to add a commentAdd a comment