Bhopal Police
-
60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్
భోపాల్ : విదేశాలకు చెందిన 60 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను భోపాల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విదేశీయుల చట్టం నిబంధన ఉల్లంఘించి పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనందున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఉజ్బెకిస్తాన్, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్.. దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారు ఉన్నారు. అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులు వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా భోపాల్‌లోని పలు పోలీసు స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా భోపాల్ ఐజీ ఉపేంద్ర జైన్ తెలిపారు. (చదవండి : అహ్మదాబాద్‌లో 700 మంది సూపర్ స్ప్రెడర్స్) అరెస్ట్ అయినవారిలో కొందరికి ఇదివరకే కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దీంతో అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులందరినీ క్వారంటైన్లో ఉంచినట్టు చెప్పారు. కాగా, టూరిస్ట్ వీసాల మీద భారత్‌కు వచ్చిన విదేశీ తబ్లిగీ సభ్యులు నిబంధనులకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా సమాచారం ఉండటంతోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తబ్లిగీ సభ్యులు బెయిల్ పిటిషన్‌ను భోపాల్‌లోని లోకల్ కోర్టు తిరస్కరించింది. (చదవండి : కరోనా వ్యాప్తిపై కొత్తలెక్క!) -
అనుమానంతో నాలుగోభార్యను అతిదారుణంగా..
భోపాల్: వేధింపులకు తాళలేక మొదటి ఇద్దరు భార్యలు అతణ్ని వదిలేసి పోయారు.. మూడోభార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.. ఇప్పుడు నాలుగోభార్యను అతికిరాతకంగా చంపేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గురువారం వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి అశోకా గర్డెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ సునీల్ శ్రీవాస్తవ చెప్పిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని ప్రగతి నగర్ ప్రాంతంలోని ఓ గదిలో దంపతులు అద్దెకుంటున్నారు. మూడురోజులుగా రాకపోకలులేకపోవడం, గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. గదితలుపులు పగులగొట్టగా.. దాదాపు కుళ్లిపోయే దశకు చేరిన మహిళ మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టంలో.. మృతురాలిపై అత్యాచారం జరిగినట్లు, శరీరభాగాల్లోకి బీరు సీసాలు దించినట్లు గుర్తించారు. గంటలపాటు సాగిన వేటలో పోలీసులు నిందితుణ్ని పట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో స్థానికుల సాక్ష్యాలు కీలకంగా మారాయి. సదరు నిందితుడు రోజుకూలీగా పనిచేసేవాడని, ఆమె మాత్రం ఇంట్లోనే ఉండేదని స్థానికులు చెప్పారు. ఇంటి యజమానితో మహిళకు సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అతను నిత్యం గొడవపడేవాడని పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, ఆమె అతనికి నాలుగోభార్య అని, ఇంతకుముందు మూడో భార్య కూడా అనుమానాస్పద రీతిలో మరణించిందని ఎస్సై శ్రీవాస్తవ వివరించారు. -
ఆ నలుగురినీ నడివీధిలో చెప్పులతో..
-
ఆ నలుగురినీ నడివీధిలో..
సాక్షి, భోపాల్ : యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు రేపిస్టులను పోలీసులు భోపాల్ పట్టణ వీధుల్లో బహిరంగంగా పరేడ్ చేయించారు. 20 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని మహారాణా ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు అదేరోజు నిందితులను అదుపులోకి తీసుకుని పట్టణ వీధుల్లో తిప్పారు. రేపిస్టులపై ఈ సందర్భంగా పలువురు యువతులు, మహిళలు చెప్పులతో దాడి చేశారు. నిందితుల్లో ఒకరైన 21 ఏళ్ల శైలేంద్ర దంగి బాధితురాలి కాలేజ్‌లో ఆమె కన్నా ఏడాది సీనియర్. శనివారం ఎంపీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు రావాలని ఆమెను కోరాడు. రెస్టారెంట్లో కలుసుకున్న వీరిద్దరికీ ఓ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న శైలేంద్ర బాధితురాలిని అక్కడకు సమీపంలోని తన స్నేహితుడు సోనూ దంగీ రూమ్‌కు తీసుకువెళ్లాడు. అప్పటికే సోనూతో పాటు అక్కడ మరో ఇద్దరు స్నేహితులు ధీరజ్ రాజ్పుట్, చిమన్ రాజ్పుట్లున్నారు. సోను, చిమన్లు సహకరించగా శైలేంద్ర, ధీరజ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను విడిచిపెడుతూ ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని హతమారుస్తామని హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో భోపాల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళల్లో ధైర్యాన్ని నింపి వేధింపుల ఘటనలపై వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తారనే ఉద్దేశంతోనే నిందితులను వీధుల్లో తిప్పామని భోపాల్ ఐజీ జైదీప్ కుమార్ చెప్పారు. -
పోలీస్ స్టేషన్ కు డిగ్గీరాజా
భోపాల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్ విధాన సభ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో భాగంగా చేపడుతున్న విచారణలో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన గురువారం పోలీసుల వద్దకు వెళుతున్నారు. జహంగిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. 1993 నుంచి 2003 మధ్యకాలంలో ఈ కుంభకోణం చేసుకుంది. ఆ సమయంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జహంగిరాబాద్ పోలీసులు దిగ్విజయ్ సింగ్‌పై, నాటి స్పీకర్ శ్రీనివాస్ తివారీ, ఇతర వ్యక్తులపై విధాన సభకోసం జరిగిన రిక్రూట్ మెంట్లో మోసం, కుట్ర, నకిలీ, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు.