లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మరణానికి కారణమైన భోలే బాబా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తనని తాను స్వయంగా దేవుడిగా ప్రకటించుకున్న భోలే బాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలోని మెయిన్‌పురిలో భారీ మొత్తంలో పొందిన విరాళాలతో నిర్మించిన విశాలమైన ఆశ్రమం ఆయన భక్తులలో ఆయనకున్న పట్టు, ఆదరణకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
అయితే వివాదాలు ఆయన్ని వెంటాతుండడంతో తన ప్రాణాలు ముప్పు వాటిల్లుతుందనే అనుమానం ఎక్కువగా ఉండేదని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలోని తన ఇంటికి దాదాపు ఎనిమిదేళ్లుగా భోలే బాబా వెళ్లలేదు. అతని చుట్టూ బ్లాక్ కమాండో తరహాలో మహిళలు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు తేలింది.
ఆశ్రమంలో భోలే బాబాకు ఓ గది ఉంది. అందులో భోలే బాబా ఎంపిక చేసిన ఏడుగురు వ్యక్తులకు మాత్రమే అందులోకి అనుమతించే వారు. ఏడుగురిలో మహిళలు,సేవకులున్నారు.సెక్యూరిటీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా రాత్రి 8 గంటల తర్వాత ఎవరినీ కలవడని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
భోలో బాబాకు రక్షణా ఉండే సిబ్బందికి ఒక కోడ్ వర్డ్, ప్రతి సెక్యూరిటీ స్క్వాడ్‌కి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది.నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే మూడు బృందాలు బాబాను రక్షించడానికి 24 గంటలూ పని చేస్తాయి.
నారాయణి సేనలోని సిబ్బంది గులాబీ రంగు దుస్తులు, గరుడ్ యోధ నల్లని దుస్తులను (స్థానికులు వారిని బ్లాక్ కమాండోలు అని పిలుస్తారు.హరి వాహక్ సభ్యులు విలక్షణమైన టోపీలు, గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు.
బ్లాక్ కమాండోలు బాబా కాన్వాయ్ వెంట ఉంటారు. ఎల్లప్పుడూ 20 మంది పనిచేస్తుంటారు. ప్రతి నారాయణి సేనలో 50 మంది సభ్యులు, హరి వాహక్ సభ్యులు ఒక్కొక్కరు 25 మందితో కూడిన బృందాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment