![Hathras Victim Family Wants To Shift To Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/18/hatra.jpg.webp?itok=hAl9mCNB)
హాథ్రస్: భద్రతా కారణాల రీత్యా తాము ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచే న్యాయ పోరాటం చేస్తామని హాథ్రస్ బాధిత కుటుంబం చెప్పింది. హాథ్రస్ ఘటనలో మరణించిన దళిత యువతి సోదరుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఆ కుటుంబానికి న్యాయ సాయం అందిస్తున్న సీమా కుష్వాహ కూడా స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ఎదుట ఆమె శనివారం హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఈ కేసును ఢిల్లీకి గానీ, ముంబైకి గానీ తరలించి విచారణ జరిపించాలని కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ఎస్‌డీఎం అంజలి గంగ్వార్ కుటుంబ సభ్యులను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ను అందిస్తామని చెప్పారు. పొలంలోకి వెళ్లేందుకు భద్రత కావాలని కుటుంబ పెద్ద అడిగారని, అందుకు అంగీకరించామని అంజలి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment