లక్నో: హథ్రాస్ అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి పోలీసులు అనుమతినిచ్చారు. వారిద్దరితో సహా ఐదుమంది హథ్రాస్ వెళ్లొచ్చునని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం రాహుల్, ప్రియాంక నొయిడా టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. టాటా సఫారి వాహనాన్ని ప్రియాంక స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. రాహుల్ గాంధీ, మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమె వెంట ఉన్నారు.
ఇక హథ్రాస్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు హథ్రాస్ ఘటన వెలుగుచూసిన ఐదు రోజుల తర్వాత శనివారం అక్కడికి మీడియాను కూడా అనుమతించిన సంగతి తెలిసిందే. ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగిసిన నేపథ్యంలోనే మీడియాకు అనుమతినిచ్చామని పోలీసులు తెలిపారు. కాగా, హథ్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది.
(చదవండి: సిట్ సూచనపై బాధిత కుటుంబం ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment