Shocking Sacrifice: Pregnant Madras Woman Killed 6-Year-Old Son In Kerala For Allah - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : అల్లాకోసం కన్న కొడుకు ‘బలి’

Published Mon, Feb 8 2021 12:52 PM | Last Updated on Mon, Feb 8 2021 1:46 PM

Woman kills 6year-old son in Palakkad for Allah - Sakshi

తిరువనంతపురం : మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచిన చిత్తూరు జిల్లా మదనపల్లె అమానుష ఘటనను పోలిన తాజా ఉదంతమొకటి కలకలం రేపుతోంది.  అల్లా దయ కోసం కన్నబిడ్డనే  బలి ఇచ్చిన  ఘటన కేరళ పాలక్కాడ్ జిల్లాలోని పులక్కాడ్‌లో వెలుగు చూసింది. 

పోలీసులు అందించిన  సమాచారం ప్రకారం 30 ఏళ్ల షాహిదా, తన ఆరేళ్ల కుమారుడు అమీల్ ను అల్లా కోసం గోంతు కోసి మరీ హత్య  చేసింది. శనివారం రాత్రి సులేమాన్ పెద్ద పిల్లలు ఇద్దరితో ఒక గదిలో పడుకోగా, చిన్నవాడైన ఆదిల్‌తో మరో గదిలో పడుకుంది షాహినా.  ఇంతలో ఏమైందో ఏమోగానీ, తెల్లవారుజామున పిల్లవాడిని  బాత్ రూం లోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతుకోసి హతమార్చింది. ఆ తరువాత అల్లా కోసమే తన కుమారుడిని చంపానంటూ  స్వయంగా పోలీసులకు సమాచారం అందించింది. తాము వచ్చేదాకా ఆమె గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తోందని పోలీసులు తెలిపారు. దీనికి తోడు పోలీస్ స్టేషన్‌ నంబర్‌ను సంఘటనకు ముందురోజే పొరుగువారి నుంచి షాహిదా సేకరించినట్టు కూడా విచారణలో వెల్లడైందన్నారు.  షాహిదా చేతికి గాయం కావడంతో పాటు ఈ హత్య విషయం పక్క గదిలోనే ఉన్న సులేమాన్‌కు తెలియకపోవడం అనుమానానికి దారితీస్తోందన్నారు.

సమగ్ర దర్యాప్తు తర్వాత మాత్రమే నిజానిజాలను నిర్ధారించగలమని  పాలక్కాడ్ పోలీసు సూపరింటెండెంట్, విశ్వనాధ్ చెప్పారు.  ఆమెను అదుపులోకి తీసుకుని, హత్య కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసును మానసిక కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు. కాగా పాలక్కాడ్‌కు చెందిన సులేమాన్, షాహీద్‌ భార్యా భర్తలు. గతంలో గల్ఫ్‌లో పనిచేసిన ప్రస్తుతం సులేమాన్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. షాహిదా దగ్గర్లోని మదర్సాలో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు సంతానం. అమీల్‌ మూడవ వాడు.  ప్రస్తుతం షాహిదా మూడు నెలల గర్భవతి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement