నగరంలో నరబలి? | suspected child sacrifice in hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో నరబలి?

Published Fri, Feb 2 2018 11:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ఓ డాబాపై మూడు నెలల చిన్నారి తల.. ఎవరో ముష్కరులు చిన్నారి తలను తెగ్గోసి అక్కడ పడేశారు.. మొండెం ఆచూకీ లేకుండా చేశారు.. ఇది జరిగింది బుధవారం.. పౌర్ణమి, సంపూర్ణ చంద్ర గ్రహణం కావడంతో నరబలిగా కలకలం. సమీపంలోని జనంలో భయాందోళన.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చిలుకానగర్‌లో జరిగిన ఘటన ఇది. రాజశేఖర్‌ అనే ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఇంటి డాబాపై గురువారం ఉదయం చిన్నారి తలను గుర్తించారు. మొండెం ఆచూకీ లేకపోవడం, ఘటనా స్థలిలో పరిస్థితులను బట్టి ఇది నరబలి అయి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement