ఉప్పల్ చిలుకానగర్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిపై చిన్నారి తల దొరికిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. రాజశేఖర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికంగా ఉంటున్న మెకానిక్ నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నరహరి, అతని కొడుకు రంజిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.