
సాక్షి, హైదరాబాద్: జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ప్రైడే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘కరుణామయుడైన ఏసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజూ.. మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలన్నారు.
‘ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.