మహానుభావుల త్యాగఫలం.. స్వాంతంత్య్రం
Published Mon, Aug 15 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
గుంటూరు (నెహ్రూనగర్): ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు స్వాతంత్య్రం వచ్చిందని, వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను నేరవేర్చాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మర్రి రాజశేఖర్ జెండా ఎగుర వేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా ఇప్పటికీ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందడం లేదన్నారు. గోవధ పేరుతో, కులాల పేరుతో దళితుల మీద దాడులు జరుగుతున్నాయని, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటున్నారా అని అనడం సిగ్గుచేటన్నారు. నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో స్వాతంత్య్రం లేకుండా పొయిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈనాడు కులాల, మతాల, రాజకీయాల పేరుతో దాడులు పెరిగిపోతున్నాయన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనతోనే నిజమైన స్వాతంత్య్రం వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కత్తెర క్రిస్టినా, కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement